బాలయ్యకు అమరావతిలో చంద్రబాబు మరో గిఫ్ట్..!
ఏపీ కూటమి ప్రభుత్వం అమరావతి రాజధానిపై ఫుల్ ఫోకస్ పెట్టింది. తాజాగా ప్రధాని మోడీ అమరావతి పనుల పునఃప్రారంభం చేశారు. దీంతో ప్రభుత్వం అమరావతిలో భూముల కేటాయింపులు మొదలుపెట్టింది. ఇవాళ జరిగిన సీఆర్డీఏ భేటీలో చేసిన భూకేటాయింపుల్లో సీఎం చంద్రబాబు పనిలో పనిగా తన బావమరిది, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కూడా ఓ గిఫ్ట్ ఇచ్చేశారు. గతంలో ఇచ్చిన భూములకు అదనంగా మరో విడతగా ఆయనకు భూములు కేటాయించారు.
గతంలో జరిగిన సీఆర్డీఏ భేటీలో నందమూరి బాలకృష్ణకు చెందిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రికి అమరావతి రాజధానిలో కొత్త బ్రాంచ్ ఏర్పాటు కోసం 15 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆస్పత్రి నిర్మాణం చేపట్టే ప్రాంతాన్ని ఆసుపత్రి చైర్మన్ అయిన బాలకృష్ణ సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ తో కలిసి వెళ్లి పరిశీలించారు. ఆ ప్రాంతంలో హెచ్‌టీ విద్యుత్తు లైన్లు అడ్డుగా ఉండటంతో వాటి తొలగింపు కోసం కూడా సీఆర్డీఏ అధికారులు ట్రాన్స్‌కోకు లేఖ రాశారు కూడా. దీంతో ఈ పనులు కూడా సాగుతున్నాయి.

అదే సమయంలో ఇవాళ జరిగిన సీఆర్డీఏ భేటీలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి చెందిన మెడికల్ కాలేజీ కోసం మరో ఆరు ఎకరాలు కేటాయిస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీంతో గతంలో ఇదే ఆస్పత్రికి ఇచ్చిన 15 ఎకరాలతో పాటు మరో ఆరు ఎకరాలు కూడా కలిపి 21 ఎకరాలు ఇచ్చినట్లయింది. ఫేజ్-1లో 300 పడకలతో బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించనున్నారు. భవిష్యత్తులో దీన్ని వెయ్యి పడకలకు విస్తరించనున్నారు. దీనికి అనుబంధంగా మెడికల్ కాలేజీ నిర్మాణానికి ఏర్పాట్లు చేయనున్నారు.












Click it and Unblock the Notifications