ఏపీ సీఎస్ సమీర్ శర్మకు తీవ్ర అస్వస్ధత-సమీక్ష చేస్తుండగా- మణిపాల్ ఆస్పత్రికి తరలింపు
ఏపీ సీఎస్ సమీర్ శర్మ మరోసారి తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు. ఇవాళ సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో ఆయన అస్వస్ధతకు గురయ్యారు. దీంతో ఆయన్ను వెంటనే తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. సమీర్ శర్మకు అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలే అనారోగ్యం కారణంగా కొన్ని రోజుల పాటు సెలవుపై వెళ్లి తిరిగి వచ్చిన ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ తాజాగా ఇవాళ ఉన్నపళంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సచివాలయంలో బ్యాంకులకు చెందిన అధికారులతో సమీక్ష జరుపుతున్న సమయంలో ఆయన అస్వస్ధతకు లోనయ్యారు. సమీక్ష జరుపుతూనే సమీర్ శర్మ కుర్చీలో నుంచి ఒరిగిపోయారు. దీంతో ఆందోళనకు గురైన అధికారులు ఆయనను అత్యవసరంగా అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.

గత నెలలో గుండె సంబంధిత సమస్య కారణంగా ఉద్యోగానికి సెలవు పెట్టిన సమీర్ శర్మ... హైదరాబాద్ వెళ్లి గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈ సమయంలో ఆయన స్థానంలో ఏపీ ఇంచార్జీ సీఎస్ గా విజయానంద్ ను ప్రభుత్వం నియమించారు. తిరిగి శర్మ కోలుకోవడంతో బాధ్యతలు చేపట్టారు. ఈ మధ్య వరుసగా సమీక్షలతో బిజీగా గడుపుతున్న శర్మ అస్వస్ధతకు గురయ్యారు. తాజాగా ఆపరేషన్ ముగించుకుని వచ్చిన సీఎస్ సమీర్ శర్మ ఉన్నట్టుండి సమీక్షా సమావేశంలోనే అస్వస్థతకు గురి కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications