వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ సీఎస్ సమీర్ శర్మ పదవీ కాలం మరో ఆరు నెలలు పొడిగింపు: కేంద్రం ఓకే

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ పదవీకాలం మరో 6 నెలలు పొడిగించారు. సీఎస్‌ పదవీకాలం నవంబరు 30 వరకు కేంద్రం పొడిగించింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సీఎస్‌ పదవీకాలాన్నికేంద్రం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సీఎస్‌ పదవీకాలం పెంపుపై డీవోపీటీ ఉత్తర్వులు విడుదల చేసింది.

గతంలో 6 నెలల పాటు సమీర్ శర్మకి సర్వీస్ పొడిగించించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ అనుమతి ఇచ్చింది. ఏపీలో మొదటి సారి ఆరు నెలలకు మించి పొడిగింపు పొందిన అధికారిగా సీఎస్‌ సమీర్ శర్మ గుర్తింపు దక్కించుకున్నారు. గతంలో యూపీ, బీహార్ సీఎస్‌ లకు మాత్రమే ఇలాంటి అవకాశం ఇచ్చింది కేంద్రం.

కేంద్రమంత్రులకు సీఎం జగన్‌ లేఖలు

రష్యా- ఉక్రెయిన్ సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా.. పొద్దుతిరుగుడు నూనెకు కొరత ఏర్పడిందని అందుకు ప్రత్యామ్నాయంగా ఆవనూనె దిగుమతులపై.. సుంకాన్ని తగ్గించాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు.. సీఎం జగన్ లేఖలు రాశారు.

 AP CS Sameer Sharmas tenure extended by another 6 months

ఉక్రెయిన్, రష్యాల్లో పరిస్థితుల కారణంగా ఒక్కసారిగా ప్రపంచంలో సన్ ఫ్లవర్ వంటనూనెలకు కొరత ఏర్పడిందని ఈ ప్రభావం వినియోగదారులపై పడిందని లేఖలో సీఎం జగన్ వెల్లడించారు. ప్రస్తుతం ముడి ఆవనూనెపై 38.5శాతం, శుద్ధిచేసిన ఆవనూనెపై 45 శాతం దిగుమతి సుంకం ఉందని.. దిగుమతి చేసుకునేందుకు ఈ సుంకాలు ప్రతిబంధకంగా ఉన్నాయన్నారు సీఎం జగన్. వినియోగదారుల ఇబ్బందుల దృష్ట్యా కనీసం ఏడాది కాలంపాటు ఆవనూనెపై దిగుమతి సుంకాలను తగ్గించాలని జగన్ కోరారు.

English summary
AP CS Sameer Sharma's tenure extended by another 6 months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X