ఉండి కోసం రఘురామ మరో ప్రయత్నం-పోలీసులతో చర్చలు..!

ఏపీలో తొలిసారి ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన కనుమూరు రఘురామకృష్ణంరాజు ఆ తర్వాత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కూడా అయ్యీరు. అయితే తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండి నియోజకవర్గంపై ఎమ్మెల్యే అయిన తర్వాత నుంచీ ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్న రఘురామకృష్ణంరాజు పలు కీలక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇవాళ మరో కార్యక్రమం చేపట్టేందుకు పోలీసులతో చర్చించారు.

ఉండిలో ఎమ్మెల్యేగా గెలిచాక రఘురామరాజు స్థానికంగా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా నిధుల సేకరణను ప్రారంభించారు. దీంతో ఆ వ్యవహారం చర్చనీయాంశమైంది. అప్పట్లో రఘురామకృష్ణరాజుకు పారిశ్రామికవేత్తలు, సినీ పెద్దలతో ఉన్న సంబంధాలతో వారంతా నిధులు ఇచ్చారు. వాటితో ఉండి నియోజకవర్గం అభివృద్ధి చేపడుతున్నారు.

ap deputy speaker raghurama Krishnam raju discuss police on cc cameras installation in undi

అలాగే తాజాగా ఉండి ప్రజలకు ఓ రిక్వెస్ట్ చేశారు. ఉగాది నుంచి ఉండి నియోజకవర్గంలో ఫోటో కొట్టు, ప్రైజ్ మనీ పట్టు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చిన రఘురామ..ఎవరైనా పంట కాలువలలో ప్లాస్టిక్ , ఏ విధమైన చెత్త గాని వేస్తే రూ.వెయ్యి జరిమానా విధిస్తామన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే సద్దుదేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఇదే క్రమంలో ఇప్పుడు క్రైమ్ రహిత నియోజకవర్గంగా ఉండి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడంలో భాగంగా నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని గ్రామాలలో, ముఖ్యంగా పాఠశాలలు, ఆలయ ప్రాంగణాలు, కూడళ్లలో సుమారు వెయ్యి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిపై ఇవాళ పోలీసు శాఖ అధికారులతో ఆయన చర్చలు జరిపారు. పోలీసు శాఖతో కలిసి సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించడం జరిగిందని రఘురామ ట్వీట్ చేశారు. ఈ సీసీ కెమెరాల ఏర్పాటు రెండు నెలల్లో పూర్తి చేస్తామన్నారు.

Take a Poll

తనను గెలిపించిన ఉండి ప్రజల భద్రత కోసం రఘురామ చేస్తున్న మరో ప్రయత్నంపై స్ధానికంగా హర్షం వ్యక్తమవుతోంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రఘురామరాజు ఉండిని తన సొంత నియోజకవర్గంగా మార్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీీ స్పీకర్ గా తన పరపతి ఉపయోగించి నియోజకవర్గం కోసం రఘురామ తీసుకుంటున్న నిర్ణయాలపై చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+