అల్లు అర్జున్ కు నరఘోష-రేపో మాపో.. రఘురామ సంచలన వ్యాఖ్యలు...!
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ తన తాజా చిత్రం పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సినిమా చూసేందుకు థియేటర్ కు వెళ్లి అక్కడ తొక్కిసలాట, ఓ మహిళ మృతికి కారణమయ్యారన్న ఆరోపణలపై అరెస్టు అయ్యారు. ఆయన్ను ఇవాళ అరెస్టు చేసిన చిక్కడపల్లి పోలీసులు , అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపర్చి చంచల్ గూడ జైలుకు రిమాండ్ కు పంపారు. అయితే ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే అల్లు అర్జున్ అరెస్టుపై ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు స్పందించారు.
అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన విషయం తనకు ఆలస్యంగా తెలిసిందని రఘురామ తెలిపారు. అల్లు అర్జున్ అరెస్టు తనకు చాలా బాధ కలిగించిందన్నారు. ఇంతకంటే అన్యాయం ఇంకోటి ఉండదన్నారు. ఆయన నటుడని, సినిమా నిర్మాత కాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన బెనిపిట్ తోనే తన సినిమా నిర్మాతలు ఆ థియేటర్ లో సినిమా వేసి మూపీ షోకు ఆహ్వానిస్తే వెళ్లాడన్నారు. ప్రభాస్ లాగే పాన్ ఇండియా స్టార్ అయిన అల్లు అర్జున్ అక్కడకు వెళ్తే ఫ్యాన్ హంగామాతో జరిగిన తొక్కిసలాటలో ఓ వ్యక్తి మరణించడం బాధాకరమన్నారు.

ఈ ఘటనకు ఓ ప్రమాదానికి సంబంధం లేని వ్యక్తిని బాధ్యుడిని చేయడం సరికాదని రఘురామ తెలిపారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన షోకు తనకు వెళ్లే అనుమతి కూడా ఉంటుందని భావించి అక్కడికి వెళ్లి ఉంటారన్నారు. ఈ ఘటనకు అల్లు అర్జున్ ను శుక్రవారం రోజు గతంలో తనను ఏపీలో జగన్ అరెస్టు చేయించినట్లే చేయడం కరెక్ట్ కాదన్నారు. ఇది కేవలం మానవ తప్పిదమని, సోషల్ మీడియాలో దీనికి పదేళ్ల శిక్ష అని ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రమాదానికి ఎక్కడైనా పదేళ్ల శిక్ష పడుతుందా అని రఘురామ ప్రశ్నించారు. అల్లు అర్జున్ కు తప్పకుండా బెయిల్ వస్తుందన్నారు. సినీ నటులు ప్రజల్లోకి రావడానికి భయపడే పరిస్ధితి వస్తుందన్నారు. రేవంత్ దృష్టికి వెళ్లే ఈ అరెస్టు జరిగిందా లేదా అనేది తనకు తెలియదన్నారు.
అల్లు అర్జున్ పై ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తి వెనక్కి తీసుకుంటున్నందున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞత ప్రదర్శించి జరిగిన తప్పును సరిదిద్దుకోవాలని రఘురామ కోరారు. అంత సూపర్ హిట్ సినిమా అయిన పుష్ప2తో ఆయనకు నరఘోష తగిలి ఉండొచ్చని సూచించారు. ఇవాళ రేపట్లో ఆయన జైలు నుంచి తిరిగి వస్తారని రఘురామ తెలిపారు.












Click it and Unblock the Notifications