
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీ: నో పోస్టింగ్: కొత్త పోలీస్ బాస్‌గా ఆయనే: ఢిల్లీ ఒత్తిళ్లు?
అమరావతి: ఏపీ ప్రభుత్వంలో ఉన్నతస్థాయి అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. అత్యున్నత స్థాయిలో పని చేస్తోన్న ఐఎఎస్, ఐపీఎస్ అధికారులకు స్థానం చలనాన్ని కల్పించే ప్రక్రియ మరింత ముమ్మరమైంది. ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శిగా పని చేసిన ప్రవీణ్ ప్రకాష్‌ను బదిలీ చేయడంతో ఆరంభమైన ఈ ప్రాసెస్.. ఊపందుకుంది. ఇవ్వాళ ఏకంగా పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్ బదిలీకి దారి తీసింది. ప్రవీణ్ ప్రకాష్, గౌతమ్ సవాంగ్ ఒక్కరోజు వ్యవధిలో బదిలీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
జగన్‌తో
మంచు
విష్ణు
భేటీ:
ప్రత్యక్ష
రాజకీయాల్లోకి:
మోహన్
బాబు
తప్పుకొన్న
వేళ:
ఆ
హామీ?

ఏపీ డీజీపీగా..
ఏపీ పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్ బదిలీ అయ్యారు. ఆయనను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేస్తోన్నారు. కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని ఏపీ డీజీపీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించింది ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ కొద్దిసేపటి కిందటే జీవో విడుదల చేశారు.

నో పోస్టింగ్..
గౌతమ్ సవాంగ్‌కు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాల్సిందిగా సూచించింది. అటు ప్రవీణ్ ప్రకాష్; ఇటు గౌతమ్ సవాంగ్ బదిలీ- ఈ రెండు కీలక పరిణామాలు ఒకదాని వెంట ఒకటి చోటు చేసుకోవడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.. హాట్ టాపిక్‌గా మారింది. డిబేట్స్‌కు దారి తీసింది. డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీకి కొన్ని కీలకమైన కారణాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఒకటి- పీఆర్సీ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు నిర్వహించిన ఛలో విజయవాడ ఆందోళన. రెండు- ఢిల్లీ నుంచి ఒత్తిళ్లు వచ్చాయనే ప్రచారం సాగుతోంది.

ఛలో విజయవాడ..
ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నిర్వహించిన ఛలో విజయవాడ ఆందోళనలో పాల్గొనడానికి లక్షలాదిమంది విజయవాడకు చేరుకోవడాన్ని పోలీసుల వైఫల్యంగా ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు చెబుతున్నారు. పూర్తిస్థాయి సమాచారం ఉన్నప్పటికీ.. వారిని ఎక్కడికక్కడ అడ్డుకోవడంలో విఫలం చెందారని, దీనికి డీజీపీ బాధ్యత వహించాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. పోలీసుల కళ్లుగప్పి లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు విజయవాడకు చేరుకోవడానికి ఇదే కారణమని అంటున్నారు.

ఢిల్లీ నుంచి ఒత్తిళ్లు..?
డీజీపీని బదిలీ చేయాలంటూ ఢిల్లీ నుంచి వైఎస్ జగన్‌కు ఒత్తిళ్లు వచ్చాయనే ప్రచారం కూడా సాగుతోంది. చాలాకాలంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నాయకులు.. గౌతమ్ సవాంగ్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు, ఆరోపణలు చేస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందంటూ అటు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా గౌతమ్ సవాంగ్‌ను పరోక్షంగా విమర్శలు సంధించిన సందర్భాలు లేకపోలేదు. ఆయన పనితీరుపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లడంతో బదిలీ చేయాలంటూ ఢిల్లీ నుంచి ఒత్తిళ్లు వచ్చాయనే ప్రచారం ఉంది.

కేంద్రం నుంచి అవార్డులు..
నిజానికి- గౌతమ్ సవాంగ్‌కు సమర్థుడైన అధికారిగా పేరుంది. చిత్తశుద్ధితో విధి నిర్వహణల్లో పాల్గొంటారనే గుర్తింపు ఉంది. ఆయన సారథ్యంలో ఏపీ పోలీస్ శాఖ పలు కేంద్ర అవార్డులను సాధించిన విషయం తెలిసిందే. దిశ యాప్, పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడంలో గౌతమ్ సవాంగ్ కీలకంగా మారారు. ఇంతా చేసినప్పటికీ.. పదవీ విరమణ పూర్తయేంత వరకూ జగన్ సర్కార్ ఆయనను పోలీస్ బాస్‌గా కొనసాగించలేకపోయిందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తోన్నాయి.