వివాదాస్పద బుక్: కంచ ఐలయ్యపై కేసు నమోదుకు డీజీపీ ఆదేశం

Subscribe to Oneindia Telugu

అమరావతి: ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై వెంటనే కేసు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు ఆదేశాలు జారీ చేశారు. తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా పుస్తకాన్ని రాసి కుల, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ కంచ ఐలయ్యపై ఆర్యవైశ్య సంఘాలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఐలయ్యపై కేసు నమోదు చేయాలంటూ డీజీపీ సాంబశివరావు సీఐడీ అధికారులను ఆదేశించారు. తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా పుస్తకాన్ని రచించారని, తమను స్మగ్లర్లుగా పేర్కొన్నారని ఆర్యవైశ్యులు మండిపడుతున్నారు.

AP DGP ordered file a case against kancha ilaiah

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చర్చించిన తర్వాతే డీజీపీ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. మరో వైపు ఈ పుస్తకాన్ని నిషేధించాలని, ఐలయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఆర్యవైశ్య సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh DGP Sambasiva Rao ordered file a case against Prof. Kancha Ilaiah for his controversy book.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి