ఏపీ డీజీపీ తక్షణం రాజీనామా చెయ్యాలి; టీడీపీ కార్యాలయాలపై దాడులు పోలీసుల వైఫల్యమే: టీడీపీ నేతలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులపై నేతలు భగ్గుమంటున్నారు. ఇది ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం అంటూ నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసిపి కార్యకర్తలు దాడులు చేయడం, ఆ తర్వాత చంద్రబాబు దాడులకు నిరసనగా రాష్ట్ర బంద్ కు పిలుపునివ్వడంతో రాష్ట్రంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక తెలుగుదేశం పార్టీ ఆఫీసులపై రాష్ట్రవ్యాప్తంగా దాడి జరిగినా పోలీసులు పట్టించుకోలేదని, డిజిపి కనుసన్నల్లోనే ఈ దాడులు జరిగాయని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

టీడీపీ ఆఫీస్ కు కూతవేటు దూరంలో డీజీపీ ఆఫీస్ .. అయినా సరే దాడులు
ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్ మోహన్ రెడ్డి, డీజీపీ కుమ్మక్కై చేయించిన దాడులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు . డిజిపి అదేశానుసారమే దాడులు జరిగాయని చంద్రబాబు ఆరోపణలు చేశారు. లేకపోతే వారు ఉండే ప్రాంతంలో కర్రలు, సుత్తులతో వస్తారా అంటూ ప్రశ్నించిన చంద్రబాబు దాడికి వస్తున్నారని చెప్పడం కోసం ఫోన్ చేసినా డిజిపి ఫోన్ తీయలేదని, ఆయన అపరాధి కాదా అంటూ ప్రశ్నించారు. డీజీపీ ఆఫీస్ కు కూత వేటు దూరంలోనే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడులు జరిగినా, డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఫోన్ చేసినా స్పందించలేదని టీడీపీ నేతలు సైతం మండిపడుతున్నారు.

రాష్ట్ర డిజిపి కనుసన్నల్లోనే టీడీపీ నేతలపై దాడులు
ఈ క్రమంలోనే టిడిపి పార్టీ ఆఫీస్ లపై దాడులను అడ్డుకోవడంలో వైఫల్యం చెందిన డిజిపి తక్షణం రాజీనామా చేయాలని టిడిపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో ప్రజలకు బ్రతికే హక్కు లేదని ప్రజల ప్రాథమిక హక్కులను హరిస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అధికార పార్టీ అరాచకాలకు వత్తాసు పలుకుతూ, ప్రతిపక్ష పార్టీల నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర డిజిపి కనుసన్నల్లోనే టీడీపీ నేతలపై దాడులు జరిగాయని పోలీసుల సహకారంతోనే టీడీపీ ఆఫీసులపై దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు.

డిజిపి సిగ్గుతో తలదించుకోవాలి : నక్కా ఆనంద్ బాబు
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా మారిందని, డిజిపి సిగ్గుతో తలదించుకోవాలి అని నక్క ఆనంద్ బాబు వ్యాఖ్యానించారు. కళ్ళ ముందే దాడులు జరుగుతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గుంటూరులో పోలీసుల సమక్షంలోనే టీడీపీ జెండాలను తగులబెట్టారని పేర్కొన్న నక్క ఆనంద్ బాబు రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు నిలువరించడంలో వైఫల్యం చెందిన డీజీపీ గౌతమ్ సవాంగ్ తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

డీజీపీ రాజీనామా చెయ్యాలని అయ్యన్న పాత్రుడు డిమాండ్
రాష్ట్ర డిజిపి రాజీనామా చేయాలని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు సైతం డిమాండ్ చేశారు. డిజిపి వైఫల్యం వల్లే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకపక్క దాడులు జరుగుతుంటే, వైసీపీ గూండాలు కర్రలు, రాళ్ళతో దాడులకు తెగబడితే పోలీసులు చోద్యం చూస్తున్నారన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యవాదులు తెలుగుదేశం పార్టీ ఆఫీసులపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించాలని అయ్యన్నపాత్రుడు విజ్ఞప్తి చేశారు. #YCPTerroristsAttack అంటూ తీవ్ర స్థాయిలో వైసిపి దాడులపై ధ్వజమెత్తుతున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications