AP DSC 2024: డీఎస్సీ అభ్యర్ధులకు భారీ ఊరట-షెడ్యూల్ పై హైకోర్టు కీలక ఆదేశాలు..!
ఏపీలో 6100 టీచర్ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం గతంలో జారీ చేసిన షెడ్యూల్ పై హైకోర్టు ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది. టెట్ పరీక్షకూ, డీఎస్సీ పరీక్షకూ మధ్య తగినంత వ్యవధి లేదంటూ పలువురు అభ్యర్ధులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది. దీంతో ఈసారి డీఎస్సీ రాస్తున్న అభ్యర్ధులకు భారీ ఊరట లభించినట్లయింది. ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది.

రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం గత నెలలో టెట్, డీఎస్సీ పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం టెట్ పరీక్షల నిర్వహణ తర్వాత మార్చి 14న ఫలితాలు వెలువడనున్నాయి. అయితే మార్చి 15నే డీఎస్సీ పరీక్ష నిర్వహణకు వీలుగా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో ఈ రెండు పరీక్షల మధ్య కేవలం ఒక్కరోజు మాత్రమే వ్యవధి ఇచ్చినట్లయింది. దీనిపై పలువురు అభ్యర్ధులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. వీటిపై పలుమార్లు విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది.
ఇందులో టెట్ , డీఎస్సీ పరీక్షల మధ్య కనీసం నాలుగు వారాలు సమయం ఉండాలని హైకోర్టు తీర్పులో పేర్కొంది. దీని ప్రకారం మార్చి 15 నుంచి డీఎస్సీ పరీక్షలకు వీలుగా ఇచ్చిన షెడ్యూల్ ను హైకోర్టు సస్పెండ్ చేసింది. ప్రభుత్వం తిరిగి డీఎస్సీ నిర్వహణకు నెల రోజుల వ్యవధితో మరో షెడ్యూల్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ప్రభుత్వం టెట్ పరీక్షలు ముగిసిన మార్చి 14 నుంచి నెల రోజుల గడువు అంటే ఏప్రిల్ 15 నుంచి డీఎస్సీ పరీక్షలకు తాజా షెడ్యూల్ విడుదల చేయనుంది.












Click it and Unblock the Notifications