ఏపీ ఈఏపీసెట్ టాప్ ర్యాంకర్లు వీళ్లే ?
ఆంధ్ర ప్రదేశ్ లో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్-2025 ఫలితాలు (AP EAPCET 2025 Results) రిలీజ్ అయ్యాయి. ఈ ఫలితాలను జేఎన్టీయూ-కాకినాడ వీసీ ఆచార్య సీఎస్‌ఆర్‌కే ప్రసాద్ విడుదల చేశారు. ఈ పరీక్షల్లో 75.67శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఆయన వెల్లడించారు.
ఈఏపీసెట్ పరీక్ష నిర్వహించిన కేవలం 12 రోజుల్లోనే ప్రభుత్వం ఈ ఫలితాలను విడుదల చేయడం గమనార్హం. https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_GetResult.aspx ఈ వెబ్ సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ఈ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా హైదరాబాద్‌లో కూడా మొత్తంగా 145 కేంద్రాలలో నిర్వహించారు. దాదాపు 3,62,448 మంది దరఖాస్తు చేసుకోగా.. 3,40,300 మంది హాజరయ్యారు. వీరిలో 2,57,509మంది (75.67% ఉత్తీర్ణత) అర్హత సాధించారని వెల్లడించారు.
మే 19 నుంచి 20వరకు అగ్రికల్చర్, ఫార్మా విభాగానికి నాలుగు సెషన్లలో పరీక్ష నిర్వహించగా.. 75,460 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 67,761మంది (89.80శాతం) అర్హత సాధించారు. అలాగే, మే 21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్ విభాగానికి 10 సెషన్లలో జరిగిన పరీక్షకు 2,64,840 మంది విద్యార్థులు హాజరు కాగా.. వీరిలో 1,89,748మంది (71.65శాతం) అర్హత సాధించారు.
ఇంజినీరింగ్ లో టాప్ 5 ర్యాంకర్స్..
ఇక ఇంజనీరింగ్ విభాగంలో తెలంగాణకు చెందిన ఎ.అనిరుధ్ రెడ్డి మొదటి ర్యాంకు.. శ్రీకాళహస్తికి చెందిన ఎం. భానుచరణ్ రెడ్డి రెండో ర్యాంకు.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కె. వై. సాత్విక్ మూడో ర్యాంకు సాధించారు. ఇక మహానందికి చెందిన రాంచరణ్ రెడ్డికి నాలుగో ర్యాంకు, అనంతపూర్‌కు చెందిన భూపతి నితిన్ అగ్రిహోత్రికి ఐదో ర్యాంకు సాధించారు.
అగ్రికల్చరల్‌లో టాప్ 5 ర్యాంకర్స్..
అగ్రికల్చరల్‌లో కృష్ణాజిల్లా పెనమలూరుకు చెందిన వెంకట నాగసాయి హర్ష వర్ధన్ మొదటి ర్యాంకు సాధించారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన షణ్ముఖ నిషాంత్ రెడ్టి రెండో ర్యాంకు, ఏపీలోని కోనసీమ జిల్లాకు చెందిన డేగల వినయ్ మల్లేష్ కుమార్ మూడో ర్యాంకు సాధించారు.












Click it and Unblock the Notifications