ఒంటిపూట బడుల టైమింగ్స్ లో మార్పు - తాజా ఉత్తర్వులు..!!
ఏపీలో వేసవి తీవ్రత పెరుగుతోంది. విద్యార్ధులకు ఇబ్బంది లేకుండా ఒంటి పూట బడుల పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టైమింగ్స్ వెల్లడించింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి ఏప్రిల్ 24 వరకు ఒంటి పూట బడులు కొన సాగనున్నాయి. ఆ తరువాత జూన్ 12 వరకు వేసవి సెలవులు కొనసాగనున్నాయి. పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో మాత్రం ఒంటిపూట బడుల సమయాలు వేరుగా ఉన్నాయి.
ఒంటి పూట బడులు
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పాఠశాలలకు ఒంటి పూట బడులు ప్రకటించారు. ఈ నెల 15వ తేదీ నుంచి రెండు రాష్ట్రాల్లోనూ అన్ని పాఠశాలలకు ఒంటి పూట బడులు అమలు కానున్నాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే విద్యా శాఖ అధికారులు వచ్చే విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్ ఖరారు చేసారు. ఈ మేరకు పాఠశాల నిర్వహణ సమయాలను ఖరారు చేసారు. దీంతో, వేసవి సెలవుల వరకు ఒంటి పూట బడులు నిర్వహించనున్నారు. ఏపీ, తెలంగాణలో ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో అన్ని పాఠశాలలకు రోజురోజుకూ ఒంటిపూట బడులు నడపాలని విద్యాశాఖ నిర్ణయించింది.

టైమింగ్స్ ఇలా
ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట తరగతులు మాత్రమే నిర్వహిస్తారు. ఏపీలో ఉదయం 7.45 గంటల నుంచి 12.30 గంటల వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయి. పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న బడుల్లో మధ్నాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించేలా విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలోని పాఠశాలలు ఉదయం 8 గంట లకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు కొనసాగుతాయి. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సెంటర్లలో మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వేసవి సెలవులతో
రంజాన్ మాసం కావటంతో ఉర్దూ పాఠశాలలకు ఇప్పటికే ఒంటి పూట బడులు అమల్లోకి వచ్చాయి. ఇక, ప్రస్తుత విద్యా సంవత్సరంలో చివరి వర్కింగ్ డే ఏప్రిల్ 23 వరకూ హాఫ్ డే స్కూల్స్ కొనసాగ న్నాయి. ఈ సారి ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావర ణ శాఖ కూడా హెచ్చరిస్తోంది. ఎండల తీవ్రతను గుర్తించి విద్యార్ధులకు ఇబ్బంది లేకుండా అవస రమైన నిర్ణయాలు తీసుకోవాలని ఇప్పటికే విద్యా శాఖ కు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులుగా ఖరారు చేసారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తిరిగి జూన్ 12వ తేదీ నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది.












Click it and Unblock the Notifications