ఏపీలో ఎన్నికల సమరం: పవన్ కళ్యాణ్ సీరియస్ గా ఏం చేస్తున్నారంటే!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణలో అన్ని రాజకీయ పార్టీలు బిజీ అయిపోయాయి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై పట్టు సాధించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన వరుస మీటింగ్ లతో బిజీ అయిపోయారు.
ఈసారి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పవన్ కళ్యాణ్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం హైదరాబాద్ నుండి మంగళగిరి పార్టీ ఆఫీస్ కు చేరుకున్న ఆయన నేటి నుండి రెండు రోజుల పాటు ముఖ్య నేతలతో సమావేశం అవుతున్నారు.

ముఖ్య నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు, పార్టీ బలాబలాలు పోటీ చేసే నియోజకవర్గాల తదితర అంశాలపై దృష్టి సారించి పార్టీ ముఖ్య నేతలతో చర్చిస్తున్నారు. ఇటీవల కాకినాడ జిల్లా కేంద్రంగా 14 నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలతో మూడు రోజులపాటు సమావేశమైన ఆయన త్వరలో ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలతో కూడా భేటీలు నిర్వహించనున్నట్టు తెలుస్తుంది.
ఈసారి ఎన్నికలలో పోటీ చేస్తే ఎక్కడ నియోజకవర్గాలలో విజయ అవకాశాలు ఉన్నాయి అన్నదానిపైన పవన్ కళ్యాణ్ సర్వే చేస్తున్నారు. ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటూ పరిశీలిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఒకటికి రెండుసార్లు సర్వేలు కూడా చేయించుకున్న ఆయన ఈ ఎన్నికలలో పోటీ చేయవలసిన స్థానాలను ఫైనల్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన తమకు కేటాయించాల్సిన సీట్లు నియోజకవర్గాలపై పెద్ద ఎత్తున కసరత్తులు చేస్తున్నారు.
సంక్రాంతి తర్వాత జనసేన పార్టీ అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్న క్రమంలో నియోజకవర్గాలలో పోటీపై ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులకు సూచనలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏది ఏమైనా గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి వ్యూహాత్మకంగా ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. ఇందులో భాగంగా చంద్రబాబుతో చర్చిస్తూ ఖచ్చితంగా జనసేనకు విజయావకాశాలు ఉన్న చోటే బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకుంటున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications