ఏపీ ఉద్యోగుల పోరు తీవ్రం-పీఆర్సీతో పాటు సీపీఎస్ రద్దు కూడా- వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యల చిచ్చు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ డిమాండ్లపై నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తున్న ఉద్యోగ సంఘాలు తాజాగా పోరుబాట పట్టాయి. పీఆర్సీ నివేదిక ఇవ్వడం, పీఆర్సీ ప్రకటన, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి ప్రధాన డిమాండ్లతో పాటు మరికొన్ని ఇతర డిమాండ్లను నెరవేర్చాల్సిందేనని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకూ వీటిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మధ్యమధ్యలో లీకులు మాత్రమే ఇస్తోంది.

ఉద్యోగుల పోరుబాట
ఏపీలో ఉద్యోగసంఘాల ప్రధాన డిమాండ్లు అయిన పీఆర్సీ, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్థీకరణపై వైసీపీ సర్కార్ మీనమేషాలు లెక్కిస్తోంది. తాము హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చి త్వరలో మూడేళ్లు పూర్తవుతున్నా ఇప్పటికీ వాటి ఊసేలేదు. దీంతో ఉద్యోగసంఘాలు పోరుబాట పట్టాయి. అక్టోబర్లోనే పీఆర్సీ ఇచ్చేస్తామని ఉద్యోగులకు నమ్మబలికిన ప్రభుత్వం.. ఇప్పటికీ వాటిపై మౌనంంగా ఉంటోంది. దీంతో తాజాగా ప్రభుత్వానికి డెడ్ లైన్ ఇచ్చిన ఉద్యోగులు.. ఇక చేసేది లేక పోరులోకి దిగారు. ఇప్పటికే పలు జిల్లాల్లో వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు.

పీఆర్సీపై సర్కార్ లీకులు
ఉద్యోగులు కోరుతున్న ప్రధాన డిమాండ్ పీఆర్సీని ఎప్పుడు ప్రకటిస్తారనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. సీఎం జగన్ వారంలో పీఆర్సీ ఇస్తామని తిరుపతిలో ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఆ సమయం కూడా పూర్తి కావస్తోంది. దీంతో పీఆర్సీ సాధ్యాసాధ్యాలపై సీఎం జగన్ తాజాగా సమీక్ష నిర్వహించారు. దీని తర్వాత ముూడు, నాలుగు రోజుల్లో పీఆర్సీ వచ్సేస్తోందని ఉద్యోగుల వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేయిస్తున్నారు. అయితే దీన్ని కూడా ఉద్యోగులు నమ్మే పరిస్ధితి లేదు. దీనికి ప్రభుత్వ వైఖరే ప్రధాన కారణం.

నివేదిక లేకుండా పీఆర్సీనా ?
వాస్తవానికి ప్రభుత్వం పీఆర్సీ ఇచ్చేందుకు అధికారులు ఇచ్చే నివేదికను ఉద్యోగుల ముందు పెట్టడం, దానిపై ప్రతిపాదనలు, అభ్యంతరాలు తీసుకోవడం, దాని ఆధారంగా తుది పీఆర్సీ అమలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ వైసీపీ సర్కార్ మాత్రం పీఆర్సీ నివేదిక ఇవ్వకుండానే నేరుగా పీఆర్సీ ప్రకటనకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో నివేదిక లేకుండా పీఆర్సీ ప్రకటిస్తే ఊరుకునేది లేదని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. పీఆర్సీ నివేదిక బయటపెట్టకుండానే పీఆర్సీ ఇవ్వడం మోసం చేసినట్లేనని వాదిస్తున్నాయి.

పీఆర్సీ ఇచ్చినా సీపీఎస్ రద్దుపై పోరు
ఉద్యోగులు కోరుతున్న విధంగా పీఆర్సీ ఇచ్చినా అంతటితో ఆగేందుకు తాము సిద్ధంగా లేమని ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. పీఆర్సీ ఇచ్చినా సీపీఎస్ రద్దుపై తమ పోరు కొనసాగుతుందని చెప్తున్నాయి. తాము ముందునుంచీ కోరుతున్న ప్రధాన డిమాండ్లలో పీఆర్సీ ప్రకటన ఒకటి మాత్రమేనని, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పూర్తయితేనే తమ పోరు విరమిస్తామని ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. దీంతో పీఆర్సీ ప్రకటన వచ్చినా సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం ఏదో ఒక ప్రకటన చేయక తప్పని పరిస్ధితి నెలకొంది.
Recommended Video

వెంకట్రామిరెడ్డి తీరుతో గ్యాప్
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఈ మధ్య కాలంలో మిగతా ఉద్యోగ సంఘాలపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తూ తోటి ఉద్యోగులను అవమానించేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. పీఆర్సీపై సీఎం ప్రకటన చేశారుగా.. పది రోజులు ఆగలేరా అంటూ సహ ఉద్యోగ సంఘాల నేతల్ని టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు వెంకట్రామిరెడ్డి తీరుపై మిగతా ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడుతున్నారు. వెంకట్రామిరెడ్డి ప్రభుత్వ ప్రతినిధి అయితే చెప్పాలని, అప్పుడు తాము ఆయన వ్యాఖ్యల్ని సీరియస్ గా తీసుకుంటామని వారు చెప్తున్నారు. వెంకట్రామిరెడ్డి తీరుతో ఉద్యోగులకూ, ప్రభుత్వానికీ మధ్య గ్యాప్ పెరుగుతోందన్నారు
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications