జగన్ సర్కార్ తో తేలని ఉద్యోగుల చర్చలు-ఛలో విజయవాడ యథాతథం..!

ఏపీలో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలపై ఇవాళ ఏర్పాటు చేసిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీలో పాల్గొన్న ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. వారు ప్రస్తావించిన డిమాండ్లపై ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేమని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఐఆర్ ఇచ్చే విషయంలో పూర్తిగా వెనుకడుగు వేసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ఈ నెల 27న తలపెట్టిన ఛలో విజయవాడ యథాతథంగా కొనసాగుతుందని ప్రకటించాయి.

ఉద్యోగులకు మధ్యంతర భృతి ఇవ్వడం తమ ప్రభుత్వ విధానం కాదని చర్చల తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. పూర్తి స్థాయిలో పీఆర్సీ నే ప్రకటిస్తామని ఉద్యోగులకు చెప్పామన్నారు. గతంలో కరోనా వల్ల పీఆర్సీ ప్రకటించ లేక పోయామని, పీఆర్సీ ఆలస్యం అయితేనే మధ్యంతర భృతి ఇస్తారని తెలిపారు. తాము పీఆర్సీ నే ఇస్తామని చెబుతున్నామని, ఇక ఐఆర్ ఎందుకని అడిగారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దకరణకు ప్రభుత్వం ఆలోచిస్తోందని బొత్స తెలిపారు. కానీ కోర్టు కేసుల వల్ల నిలిచిపోయిందన్నారు. ప్రభుత్వం అన్ని అంశాలలో ప్రజాస్వామ్య బద్ధంగానే వ్యవహరిస్తుందన్నారు.

ap employees chalo vijayawada to be continued as talks failed with cabinet sub-committee

మరోవైపు ఇవాళ జరిగిన ఫలప్రదం కాకపోవడంతో నిరాశ చెందిన ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు.. ప్రభుత్వం తో చర్చలు కొనసాగుతాయన్నారు. ప్రభుత్వం జీవోలు ఇచ్చే వరకూ ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందన్నారు. 49 డిమాండ్ లు ప్రభుత్వం ముందు పెట్టామని, 30 శాతం మధ్యంతర భృతి అడిగితే ప్రభుత్వం పీఆర్సీ ఇస్తామని చెబుతోందన్నారు. జీవో ల బట్టి ఉద్యమ కార్యాచరణ పై నిర్ణయం ఉంటుందన్నారు. పీఆర్సీని జూలై నాటికి చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పిందని, ప్రభుత్వ చర్యల ఆధారంగా ఉద్యమ కార్యాచరణ ఉంటుందన్నారు. గత సమావేశంలో చెప్పిన వాటినే ప్రభుత్వం మళ్ళీ చెప్పుకొచ్చిందని ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+