శాంతి భర్తకు సాయిరెడ్డి షాకింగ్ గిఫ్ట్ ..! లోకేష్ ను కలిసి ఫిర్యాదు..
ఏపీలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికీ, దేవాదాయశాఖ సహాయ కమిషనర్, ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న కళింగిరి శాంతి భర్త మదన్ మోహన్ కూ మధ్య వివాదం మరింత ముదిరింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో తనను మోసపూరితంగా అమెరికా పంపి తన భార్య శాంతితో సాయిరెడ్డి అక్రమ సంబంధం పెట్టుకున్నారంటూ మదన్ ఆరోపించారు. దీనిపై స్పందించిన శాంతి తన మాజీ భర్త ఆరోపణలు నిజం కాదని ఖండించారు. అయినా ఆయన ఆరోపణల పర్వం కొనసాగుతోంది. అయితే తాజాగా మదన్ హైదరాబాద్ నుంచి కోల్ కతా బదిలీ అయ్యారు.
విజయసాయిరెడ్డితో తన భార్య శాంతి అక్రమ సంబంధం, దీనిపై తాను చేస్తున్న పోరాటం నేపథ్యంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకింగ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న తనను హైదరాబాద్ నుంచి కోల్ కతాకు బదిలీ చేయించారని ఆయన ఆరోపిస్తున్నారు. ఇదే ఆరోపణలతో మదన్ తాజాగా మంత్రి నారా లోకేష్ ను ప్రజాదర్బార్ కు వెళ్లి కలిశారు. ఎంపీ విజయసాయిరెడ్డి తన భార్యను లోబర్చుకొని విశాఖపట్నంలో రూ.1500 కోట్ల విలువైన భూములు కొల్లగొట్టారని, ఆయన అక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలపై పోరాడుతున్నందుకు తనను ఇటీవల హైదరాబాద్ నుంచి కోల్ కతాకు బదిలీ చేయించారని సస్పెన్షన్ కు గురైన దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కళింగిరి శాంతి భర్త మదన్ మోహన్ ఫిర్యాదు చేశారు.

విజయసాయి రెడ్డి, అడ్వకేట్ సుభాష్ కలసి తన భార్య కళింగిరి శాంతిని లోబర్చుకొని విశాఖలో ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు పెద్దఎత్తున భూములు కొల్లగొట్టారని ఆరోపించారు. అలాగే తనను ఏమార్చి అమెరికా పంపిన విజయసాయి తన భార్య శాంతితో రహస్యంగా సహజీవనం చేసి మగబిడ్డను కన్నారన్నారు. తాను స్థానికంగా లేని సమయంలో బిడ్డకు విజయసాయిరెడ్డే తండ్రి అని గట్టిగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు. తనకు న్యాయం చేయాల్సిందిగా రాష్ట్రపతి, ప్రధాని కార్యాలయాలతో పాటు రాష్ట్ర హోంమంత్రి డీజీపీలను కలిసి విన్నవించినట్లు పేర్కొన్నారు.
ఇప్పటివరకు తనకు న్యాయం జరగలేదని, విజయసాయిరెడ్డికి డిఎన్ఎ పరీక్షలు నిర్వహించి శాంతికి కలిగిన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో శాంతి అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేసిన కాలంలో రూ.20కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించిందని,. కుంచనపల్లిలో రూ.4కోట్ల విలువైన విల్లా, జగన్ ఇంటి సమీపంలో రూ.3కోట్ల విలువైన ఇల్లు, విశాఖ సాగర్ నగర్లో ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ తోపాటు ఆమెకు విలాసవంతమైన కార్లు ఉన్నాయని మదన్ ఆరోపించారు. విశాఖలో విజయసాయి, సుభాష్, తన భార్య శాంతి కలిసి కొట్టేసిన రూ.1500 కోట్ల భూములపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు, విజయసాయి కుట్రతో కోల్ కతా బదిలీ అయిన తనను తిరిగి హైదరాబాద్ కు ట్రాన్స్ ఫర్ చేయించాలని మదన్ మోహన్ కోరారు. ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications