విద్యార్థుల కోసం విశాఖలో కేఏ పాల్ నిరసనదీక్ష ..ఏపీలో పరీక్షల రద్దుపై జగన్ కు డిమాండ్ !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ అంశం చిలికి చిలికి గాలివానగా మారింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో పరీక్షల నిర్వహణ సరికాదని పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి.మరోవైపు కోర్టు మెట్లు ఎక్కి న్యాయపోరాటానికి దిగాయి.ఇదిలా ఉంటే నిన్నటికి నిన్న ఏపీలో పదవ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశానని పేర్కొన్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ నేడు నిరసన దీక్ష చేపట్టారు.
Recommended Video

విశాఖలో నిరసన దీక్ష చేపట్టిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో పరీక్షల నిర్వహణ సరికాదని కేఏ పాల్ పేర్కొన్నారు. విశాఖలోని కేఏ పాల్ కు సంబంధించిన కన్వెన్షన్ భవనంలో నిరసన దీక్ష చేపట్టిన పాల్, ప్రభుత్వం పరీక్షల నిర్వహణ ఆలోచన విరమించుకునే వరకు, నిర్ణయం మార్చుకునే వరకు దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. విద్యార్థుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని పరీక్షలను వాయిదా వేయాల్సిన అవసరం ఉందని కేఏ పాల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

పరీక్షల రద్దు అడగటం లేదు , ప్రస్తుతానికి ఆ పని చెయ్యమన్న కేఏపాల్
తాను కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించిందని, రేపు వాదనలు జరుగుతాయని ఆశిస్తున్నానని పాల్ పేర్కొన్నారు. అంతేకాదు 35 లక్షల మంది విద్యార్థులకు మేలు జరిగే వరకు దీక్ష కొనసాగుతుందని తెలిపిన పాల్, పరీక్షలు రద్దు చేసి పాస్ చేయమని అడగడం లేదని రెండు నెలల పాటు కరోనా ఉద్ధృతి తగ్గేవరకు వాయిదా వేయమని అడుగుతున్నామని స్పష్టం చేశారు. జగన్ పరీక్షలు రద్దు చేసే వరకు దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు .

ఊహించని విధంగా రంగంలోకి దిగిన కేఏ పాల్
కేఏ పాల్ తన పిల్లల్ని పరీక్షలకు పంపడం లేదంటూ స్పష్టం చేశారు.తన దీక్ష దగ్గరకు ఎవరూ రావద్దని, పరీక్షల విషయంలో ప్రభుత్వ వైఖరి మార్చుకునేవరకు దీక్ష సాగిస్తానన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.ఇక తాజాగా ఏపీ సర్కార్ పరీక్షల నిర్వహణపై మొండిగా ప్రవర్తిస్తున్న సమయంలో కేఏ పాల్ ఊహించని విధంగా రంగంలోకి దిగారు. అధికార వైసీపీపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటికి నిన్న పది,ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలంటూ కె ఏ పాల్ సైతం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

జగన్ సర్కార్ ను పరీక్షలపై టార్గెట్ చేసిన పాల్ .. కోర్టులో పిటీషన్
కరోనా సోకితే విద్యార్థుల ప్రాణాలకు ఎవరు భరోసా ఇస్తారని జగన్ సర్కార్ ను ప్రశ్నించారు. ఇలాంటి సమయంలో మీ పిల్లలను పరీక్షలకు పంపిస్తారా ? మీ మంత్రులు పంపిస్తారా ? అంటూ జగన్ ను నిలదీశారు . మీ పిల్లలవే ప్రాణాలా అని నిలదీశారు . దేశంలో అన్ని రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేస్తుంటే, పరీక్షలు నిర్వహించడం వల్ల ఏపీలో కరోనా సోకితే విద్యార్థుల ప్రాణాలకు ఎవరు భరోసా ఇస్తారంటూ మండిపడ్డారు. విద్యార్థులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఏపీలో పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కెఏ పాల్.












Click it and Unblock the Notifications