అప్పులపై కేంద్రమే చెప్పిందిగా ! ఇంకా ఏంటీ గోల? విపక్షాలపై బుగ్గన అసహనం...
ఏపీలో వైసీపీ సర్కార్ చేస్తున్న అప్పులపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. గత టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పులు, వైసీపీ సర్కార్ చేసిన అప్పులపై కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులోనే క్లారిటీ ఇచ్చారు. అయినా బీజేపీ నేతలు వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. దీనిపై రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఇవాళ అసహనం వ్యక్తం చేశారు. విపక్షాల తీరుపై బుగ్గన తీవ్రంగా మండిపడ్డారు.
ఏపీ ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసిందన్న ఆరోపణలకి కేంద్రమే సమాధానం చెప్పిందని బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. ఈ నాలుగేళ్ళ అప్పులపైనే ఎందుకు విమర్శలు చేస్తున్నారని విపక్షాల్ని ప్రశ్నించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులపై ఎందుకు మాట్లాడ్డం లేదని నిలదీశారు. ఏపీకి కేంద్రం నుంచి సహకారం అందకూడదని ప్రయత్నం చేస్తున్నారని విపక్షాలపై మండిపడ్డారు.
రాష్ట్ర అప్పులపై కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్నారని ఏపీ బీజేపీ ఛీఫ్ పురందేశ్వరిని ఉద్దేశించి బుగ్గన వ్యాఖ్యానించారు.అప్పులపై కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై ఎవరు మాట్లాడరని, ఏపీ శ్రీలంక అయిపోతుందని మాట్లడతారని బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో నివాసం లేని వారు ఇంకా ఎక్కువ విమర్శలు చేస్తున్నారన్నారు. ఉండేది హైదరాబాద్ చేసే విమర్శలు ఏపీ పై..ఇదేంటి అని చంద్రబాబు, పవన్ ను బుగ్గన ప్రశ్నించారు.
ఆర్బీఐ చెప్తే నమ్మరుస పురందేశ్వరి చెప్తే విమర్శలు చేస్తారా అని బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. నేను సింహం అంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారని, ఆయన కుమారుడు కూడా జంతువులతో పోల్చుకుంటున్నారని విమర్శించారు. అప్పుల విషయం లో కూడా ప్రతిపక్ష పార్టీల మధ్య ఒక్క మాట లేదని, ఒక్కొక్కరిది ఒక్కో మాట అని బుగ్గన ఆరోపించారు. వీటన్నిటికీ కేంద్రం పార్లమెంటులో సమాధానం చెప్పిందన్నారు.

రాష్త్రం లో అప్పులపై చాలా మంది చాలా మాట్లాడుతున్నారని, సొంతంగా ప్రకటించుకున్న అర్డికవేత్తలు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు ఇలా అప్పుల పై మాట్లాడేస్తున్నారన్నారు. పార్లమెంటు లో వీరంతా వేస్తున్న ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక మంత్రి సమాధానం ఇచ్చేశారన్నారు. మొత్తం గా 4.41 లక్షల కోట్లు ఉందని చెప్పారని, మరి అందరూ ఆరోపించిన 10 లక్షల కోట్లు ఏమైందన్నారు. ఈ నాలుగేళ్లుగా నే రాష్ట్ర అప్పుల పై సోకాల్డ్ ఆర్ధిక వేత్తలు మాట్లాడారని విమర్శించారు. ఏపి కి కేంద్రం సహకారం అందకూడదనే వీరంతా ఫిర్యాదులు చేశారన్నారు.
కేంద్ర మంత్రులు, ఆర్బీఐ చెబితే విశ్వసించ కుండా ఎవరో సంబధం లేని వ్యక్తులు అప్పులు అని చెబితే వింటారా అని బుగ్గన ప్రశ్నించారు. 2019 నుంచి ప్రతిపక్షాలు కు మేం అంటే గిట్టకే అప్పుల పై దుష్ప్రచారం చేశారని, దేశంలో అన్ని రాష్ట్రాలకు వర్తించే నిబంధనలు ఏపీకి వర్తిస్తున్నాయన్నారు.ఏపీ కి శ్రీలంక కు పోలిక పెట్టారని, ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతిపక్ష నేతలు అంతా పొరుగు రాష్ట్రంలో ఉంటున్నారన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications