వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారతీయ సంస్కృతి మేరకే రాహుల్‌తో అలా, కాంగ్రెస్‌తో చర్చించలేదు: యనమల

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: బిజెపి, వైసీపీ నేతలపై ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడును ప్రజలకు దూరం చేసేందుకు వైసీపీ, బిజెపి పథకం ప్రకారం వ్యవహరిస్తున్నాయని ఆయన ఆరోపించారు.

గురువారం నాడు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసుల మాఫీ కోసం కేంద్రం పెద్దల ముందు రాజీ పడిన చరిత్ర వైసీపీ పార్టీదని ఆయన విమర్శించారు. ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హమీని బిజెపి అమలు చేయకుండా ఓ పార్టీ అండ చూసుకొని తెలుగు ప్రజలకు అన్యాయం చేసిందని ఆయన బిజెపిపై ఆరోపణలు చేశారు.

Ap finance minister Yanamala Ramakrishnudu fires on Ysrcp and Bjp

బెంగుళూరులో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రాంతీయ పార్టీలు, వామపక్షాల నేతలతో సమావేశమయ్యారని ఆయన చెప్పారు. ఏపీకి జరిగిన అన్యాయంపై ఆయా పార్టీల నేతలతో చర్చించారని యనమల వివరించారు.

ఈ చర్చల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఎవరు కూడ లేరని యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. జెడిఎస్ పార్టీ ఆహ్వానం మేరకే ఏపీ సీఎ: చంద్రబాబునాయుడు కుమారస్వామి ప్రమాణస్వీకారానికి హజరయ్యారని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పిలిస్తే ఈ కార్యక్రమానికి తాము హజరు కాలేదన్నారు.

వేదికపై ఒకరికొకరు ఎదురైనప్పుడు అభినందించుకోవడం సంస్కారమని భారతీయ సంస్కారాన్ని కూడ తప్పుబట్టడం సరికాదన్నారు. ఇందులో భాగంగానే రాహుల్‌గా బాబు షేక్ హ్యాండ్ ఇచ్చారని ఆయన వివరణ ఇచ్చారు. అసెంబ్లీలో జాతీయ గీతం వస్తున్న సమయంలో కూడ అసెంబ్లీ నుండి బయటకు వెళ్ళిన సంస్కృతి యడ్యూరప్పదని ఆయన విమర్శలు గుప్పించారు.

English summary
Andhrapradesh finance minister Yanamala Ramakrishunudu fired on Ysrcp and Bjp leaders. he spoke to media on Thursday at Amaravathi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X