ఏపీ వరద సాయం 600రూపాయలు.. పవన్ కళ్యాణ్ స్పందన హైలెట్!
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలమైన విషయం తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ ముంపు బారిన పడి ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరదల కారణంగా జరిగిన నష్టానికి సినీ, రాజకీయ ప్రముఖులు మాత్రమే కాదు సామాన్య ప్రజలు కూడా తమ వంతుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి సహకారం అందిస్తున్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ కు 600రూపాయలు
తాజాగా ఓ రోజు వారి కూలి పని చేసుకునే వ్యక్తి ముఖ్యమంత్రి సహాయ నిధికి 600 రూపాయలను విరాళంగా అనిపించారు. ఈ విషయాన్ని సదరు వ్యక్తి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ రోజు నేను పనికి వెళ్లి సంపాదించిన 600 రూపాయలను విజయవాడ వరద బాధితుల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి పంపిస్తున్నాను. ఆదివారం పని ఉంది ఆ డబ్బులు కూడా పంపిస్తాను అని పేర్కొన్నారు.

పవన్ స్ఫూర్తితో కూలీ పని చేసుకునే వ్యక్తి వరద సాయం
పవన్ కళ్యాణ్ గారు నాకు స్ఫూర్తి. కష్టాలనేవి అందరికీ వస్తూ ఉంటాయి. ఆ కష్టం ఏంటన్నది కష్టపడిన వారికి మాత్రమే తెలుస్తుంది అంటూ గొడవర్తి సుబ్రమణ్యం అనే వ్యక్తి తాను పవన్ కళ్యాణ్ ను ఆదర్శంగా తీసుకొని వరద బాధితుల కోసం 600 రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధికి పంపించాను అని పేర్కొన్నారు.
స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఇక ఈ ట్వీట్ కు డిప్యూటీ సీఎంవో కార్యాలయం సైతం స్పందించింది. రోజువారి కూలి చేసుకునే వ్యక్తి తన ఒకరోజు సంపాదనను వరద బాధితుల కోసం సహాయాన్ని అందించడం పైన పవన్ కళ్యాణ్ ఆ వ్యక్తికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. రోజువారీ కష్టం చేసుకుంటూ సంపాదించిన మీ కష్టార్జితం నుండి వరద బాధితులకు సహాయం అందించాలని మీ ఆలోచన స్ఫూర్తిదాయకమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
రోజువారీ కష్టం చేసుకుంటూ సంపాదించిన మీ కష్టార్జితం నుండి వరద బాధితులకు సహాయం అందించాలనుకున్న మీ ఆలోచన స్ఫూర్తిదాయకం. ఆపదలో ఉన్నవారికి మనస్ఫూర్తిగా ఇచ్చే ప్రతీ రూపాయి విలువైనది, అది చిన్నది అని సంకోచించే వారికి ఇది ఒక ప్రేరణ . నిస్వార్ధంగా ప్రజల కష్టాల కోసం ఆలోచించి ముఖ్యమంత్రి… https://t.co/zxnq7XM7UL
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) September 7, 2024
మనస్పూర్తిగా ఇస్తున్న మీ 600 రూపాయలు చాలా విలువైనవి : పవన్ కళ్యాణ్
ఆపదలో ఉన్న వారికి మనస్పూర్తిగా ఇచ్చే ప్రతి రూపాయి విలువైనది అని ఆయన తెలిపారు. అది చిన్నది అని సంకోచించే వారికి ఇది ఒక ప్రేరణ అంటూ ఆయన పేర్కొన్నారు. నిస్వార్ధంగా ప్రజల కష్టాల కోసం ఆలోచించి ముఖ్యమంత్రి సహాయ నిధికి సుబ్రమణ్యం అందించిన 600 రూపాయలు చాలా విలువైనవని మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
సాయం చేసే మనసు ఉండటం ముఖ్యం
సదరు రోజువారీ కూలి చేసుకునే వ్యక్తి చేసిన వరద సాయానికి స్పందించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్వీట్ బాగా వైరల్ అవుతుంది. సహాయం చిన్నదా పెద్దదా అన్నది కాదు సహాయం చేసే మనసు ఉండటం ముఖ్యం అన్నది ఈ పోస్టు ద్వారా అందరికీ అర్థమవుతుంది.
-
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
మరో మూడు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
బంగాళాఖాతంపై మరింత విస్తరించిన ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..!












Click it and Unblock the Notifications