ఏపీ అటవీ అధికారి రమణమూర్తి ఆత్మహత్య.. హైదరాబాద్ లో ఐదంతస్తుల భవనంపై నుండి దూకి

ఆంధ్రప్రదేశ్ అటవీ అధికారి వీబీ రమణ మూర్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు . ప్రస్తుతం అటవీ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న ఆయన హైదరాబాద్ లోని తన నివాసం లో ఆత్మహత్య చేసుకున్నారు. నాగోల్ లో ఆయన నివాసం ఉంటున్న రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్ ఐదో అంతస్తు నుంచి దూకి ఈరోజు తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డారు. 1987 బ్యాచ్ కు చెందిన వారు వీబీ రమణ మూర్తి ఆత్మహత్యపై అటవీశాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీబీ రమణ మూర్తి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే కుటుంబ సభ్యులు పని ఒత్తిడి కారణంగా ఈఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులకు చెప్పినట్టు సమాచారం .

 AP Forest Officer Ramanamurthy commits suicide by jumping from building in Hyderabad

ఆయన గత రెండు నెలలుగా డిప్రెషన్ తో బాధ పడుతున్నారని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇటీవల అనారోగ్య కారణాలతో ఓ పోలీస్‌ అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డారు . శ్రీకాకుళం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా విధులు నిర్వర్తించిన కృష్ణ వర్మ విశాఖ బీచ్‌ రోడ్డులోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పని ఒత్తిడి లేదా ఇతరత్రా కారణాలతో ప్రభుత్వోద్యోగులు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్న పలు ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి.

Recommended Video

    Sushant Singh Rajput : Sushant కనపడక దయనీయ స్థితిలో పెంపుడు కుక్కలు..!

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+