• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపీ గంజాయి తెలంగాణాకు: పట్టుకున్న వరంగల్ టాస్క్ ఫోర్స్; రైళ్ళ ద్వారా జరుగుతున్న అక్రమ దందా!!

|
Google Oneindia TeluguNews

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి గంజాయి అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతుందా? విశాఖ ఏజెన్సీ కేంద్రంగా తెలంగాణ రాష్ట్రానికి గంజాయి స్మగ్లింగ్ నిత్యకృత్యంగా మారింది? రోడ్డు రవాణా మార్గాలు, రైలు మార్గాలు ఇలా ఉన్న ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకొని గంజాయి స్మగ్లర్లు దందా సాగిస్తున్నా రా? తెలంగాణాలో గంజాయి గుప్పుమనటం వెనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణాకు వస్తున్న గంజాయే కారణమా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

ఏపీ గంజాయిపై మాట్లాడిన తెలంగాణా పోలీసులపై కేసులు పెట్టే దమ్ముందా? జగన్ కు గోరంట్ల సవాల్ !!ఏపీ గంజాయిపై మాట్లాడిన తెలంగాణా పోలీసులపై కేసులు పెట్టే దమ్ముందా? జగన్ కు గోరంట్ల సవాల్ !!

తెలంగాణాలో తగ్గిన గంజాయి సాగు .. అయినా తెలంగాణాలో గంజాయి గుప్పు

తెలంగాణాలో తగ్గిన గంజాయి సాగు .. అయినా తెలంగాణాలో గంజాయి గుప్పు


ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా గంజాయిని విరివిగా సాగు చేశారు. భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల, ఆదిలాబాద్ జిల్లా నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో, పలు ఏజెన్సీ ప్రాంతాలలో అక్కడ కూడా కొద్ది మొత్తంలో గంజాయి సాగు జరుగుతుండేది. కానీ తెలంగాణ సర్కార్ గంజాయి క్షేత్రాలపై ప్రత్యేకమైన దృష్టి సారించి గంజాయి సాగును ధ్వంసం చేస్తున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో గంజాయి సాగు గణనీయంగా తగ్గింది. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో గంజాయి గుప్పుమంటుంది. దీనికి కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణకు అక్రమ రవాణా అవుతున్న గంజాయి అని తాజాగా పలు సంఘటనలను బట్టి అర్థమవుతుంది.

తెలంగాణలో ఇటీవల పట్టుబడుతున్న గంజాయి కేసుల మూలాలు ఏపీ నుండే

తెలంగాణలో ఇటీవల పట్టుబడుతున్న గంజాయి కేసుల మూలాలు ఏపీ నుండే

ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దానికి మూలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఉండటం ప్రధానంగా కనిపిస్తుంది. మొన్నటికి మొన్న నల్గొండ జిల్లాలో గంజాయి స్మగ్లర్లు పట్టుబడిన క్రమంలో వారు విశాఖ ఏజెన్సీ నుండి గంజాయి తరలిస్తున్నట్లుగా గుర్తించిన నల్గొండ పోలీసులు, ఆ కేసుతో సంబంధం ఉన్న మరికొందరు స్మగ్లర్లను పట్టుకోవడానికి విశాఖ ఏజెన్సీ లంబసింగి ప్రాంతానికి వెళ్లారు. అక్కడ తనిఖీ చేస్తున్న పోలీసు బృందంపై గంజాయి స్మగ్లర్లు గొడ్డళ్లు, కత్తులు, రాళ్లతో దాడికి దిగడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ఇద్దరు గాయపడ్డారు. ఇక ఈ వ్యవహారం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర ప్రకంపనలు రేపుతున్న విషయం తెలిసిందే.

ట్రైన్ ద్వారా గంజాయి తరలిస్తున్న గ్యాంగ్ ను పట్టుకున్న పోలీసులు

ట్రైన్ ద్వారా గంజాయి తరలిస్తున్న గ్యాంగ్ ను పట్టుకున్న పోలీసులు

అదలా ఉంటే తాజాగా మరోమారు తెలంగాణ రాష్ట్రంలో ఏపీ విశాఖ ఏజెన్సీ నుండి తెలంగాణకు తరలిస్తున్న గంజాయి పట్టుబడింది. రైలు మార్గం ద్వారా గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రైన్ ద్వారా కావాల్సిన వారికి గంజాయిని సప్లై చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లను శుక్రవారం రోజు టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఈ కేసులో ఒక మహిళతో సహా మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం. అరెస్టు చేసిన ఇద్దరు గంజాయి స్మగ్లర్లు నుండి మూడు లక్షల 20 వేల రూపాయల విలువైన 32 కిలోల గంజాయితో పాటు రెండు సెల్ ఫోన్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

విశాఖ ఏజెన్సీ నుండే గంజాయి స్మగ్లింగ్ జరుగుతున్నట్టు గుర్తింపు

విశాఖ ఏజెన్సీ నుండే గంజాయి స్మగ్లింగ్ జరుగుతున్నట్టు గుర్తింపు

గంజాయి అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నిందితుల్లో ఒకరు విశాఖపట్నం జిల్లా ఎరమంచిలి మండలం పెద్ద గోల్లపాలెం గ్రామానికి చెందిన ద్వారపూడి మణికుమార్ గా గుర్తించారు. ఇక రెండో వ్యక్తి చెన్నారావుపేట మండలం తోవన గడ్డ తండాకు చెందిన బానోతు బిచ్యాగా గుర్తించారు. ఈ కేసులో పరారీలో ఉన్న వారు విశాఖపట్నం చెందిన ప్రధాన నిందితుడు గోడి శంకర్‌రావు, మల్లంపల్లి ములుగు జిల్లాకు చెందిన మహిళా నిందితురాలు ధరావత్ మహేశ్వరీ అలియాస్ రేష్మాగా గుర్తించారు.

విశాఖ ఏజెన్సీ నుండే గంజాయి .. ఏసీ బోగీల్లో కాస్ట్లీగా దందా

విశాఖ ఏజెన్సీ నుండే గంజాయి .. ఏసీ బోగీల్లో కాస్ట్లీగా దందా

వీరు విశాఖపట్నం జిల్లాలోని డౌనూరు, చింతపల్లి, నర్సీపట్నం ప్రాంతాల నుండి సేకరించిన గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి, వాటిని రెండు కిలోల చొప్పున ప్యాకింగ్ చేసి గంజాయి ప్యాకెట్లను అరెస్టు చేసిన ఇద్దరు నిందితులతో పాటు ప్రస్తుతం పరారీలో వున్న మహిళా నిందితురాలు మహేశ్వరీకి ఇచ్చి రైలు ద్వారా మహరాష్ట్ర, ములుగు, నర్సంపేట ప్రాంతాలకు చేరవేసేవారని వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. నిందితులు గంజాయి స్మగ్లింగ్ చేసే సమయంలో ఎవరికి అనుమానం కలగకుండా వుందేండుకుగాను గంజాయిని ఖరీదైన బ్యాగుల్లో భద్రపర్చి ఏసి బోగీల్లో ప్రయాణించేవారని పేర్కొన్నారు.

టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందిన సమాచారం .. గంజాయి దందాపై కూపీ లాగుతున్న పోలీసులు

టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందిన సమాచారం .. గంజాయి దందాపై కూపీ లాగుతున్న పోలీసులు

ఈ తరహాలో నిందితులు గత నాలుగు సంవత్సరాలుగా గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారని తెలిపారు. ఇంకా ఇలా ఎంత మంది ట్రైన్స్ ద్వారా గంజాయి తరలిస్తున్నారో అన్నది ఆరా తీస్తున్నారు.టాస్క్ ఫోర్స్ పోలీసు అధికారులకు అందిన సమాచారం మేరకు నిందితులు గంజాయి అందజేసేందుకు వరంగల్ రైల్వే స్టేషన్ బయటకి వచ్చిన నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకోని తనీఖీ చేయగా వారి వద్ద గంజాయి లభ్యం కావడంతో నిందితులను అరెస్టు చేసి ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషనుకు తరలించారు. విశాఖ ఏజెన్సీ కేంద్రంగానే తెలంగాణ రాష్ట్రానికి గంజాయి స్మగ్లింగ్ ప్రధానంగా జరుగుతున్నట్లుగా తాజా కేసును బట్టి తెలుస్తుంది.

  Hyderabad-Mumbai Bullet Train : NHSRCL ప్రతిపాదన,18న టెండర్లు...! || Oneindia Telugu
  ఏపీని తెలంగాణాకు విచ్చలవిడిగా గంజాయి అక్రమ రవాణా .. ఫోకస్ చేస్తున్న తెలంగాణా సర్కార్

  ఏపీని తెలంగాణాకు విచ్చలవిడిగా గంజాయి అక్రమ రవాణా .. ఫోకస్ చేస్తున్న తెలంగాణా సర్కార్

  ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈ తరహా ఏపీ నుండి తెలంగాణా కు తరలించిన గంజాయి కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో తాజాగా గంజాయి స్మగ్లింగ్ పై యుద్ధం ప్రకటించిన సీఎం కేసీఆర్ ఇటు తెలంగాణ రాష్ట్రంలో సాగుతున్న గంజాయి పైన కాకుండా, ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా తెలంగాణ రాష్ట్రంలోకి స్మగ్లింగ్ అవుతున్న గంజాయి పైన కూడా ఉక్కు పాదం మోపడానికి అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణకు గంజాయి స్మగ్లింగ్ కేసులు పెరిగితే ఏపీ పైన కూడా ఫోకస్ పెట్టే అవకాశం లేకపోలేదు.

  English summary
  Wherever cannabis has been seized in the state of Telangana in recent times, its origins appear to be from AP. Earlier, cannabis smugglers were nabbed in Nalgonda and now the Vishakha ganja smuggling gang caught by Warangal Task Force police.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X