ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వెయ్యబోం; ఆ రంగులు తొలగించాం : హైకోర్టుకు జగన్ సర్కార్ ప్రమాణ పత్రం

ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ సచివాలయాలు, ఇతర వాహనాలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేయడం పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఇక తాజాగా చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలకు, మోటర్లకు వైసిపి రంగులు వేయడం పై ఏపీ హైకోర్టు లో జరిగిన విచారణలో జగన్ ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల కు పార్టీ రంగులు తొలగిస్తున్నట్టు హైకోర్టుకు ప్రమాణపత్రం దాఖలు చేసింది.

భవిష్యత్ లో ఏ ప్రభుత్వ భవనానికి పార్టీ రంగులు వెయ్యబోం : ఏపీ ప్రభుత్వ ప్రమాణ పత్రం

భవిష్యత్ లో ఏ ప్రభుత్వ భవనానికి పార్టీ రంగులు వెయ్యబోం : ఏపీ ప్రభుత్వ ప్రమాణ పత్రం

భవిష్యత్తులో కూడా ఏ ప్రభుత్వ భవనానికి పార్టీ రంగులు వేయబోమని పేర్కొంటూ పంచాయతీ రాజ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టులో ప్రమాణ పత్రాన్ని దాఖలు చేశారు. ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన క్లాప్ కార్యక్రమంలో భాగంగా ఏపీని క్లీన్ ఆంధ్ర ప్రదేశ్ గా మార్చడం కోసం చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అంతవరకు బాగానే ఉన్నా వాటికి వైసిపి రంగులు వేశారు. ఈ క్రమంలో జై భీమ్ జస్టిస్ కృష్ణా జిల్లా అధ్యక్షులు పరశా సురేష్ కుమార్ వైసీపీ రంగులపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా విచారించిన హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

 రంగులు తొలగించి ప్రమాణ పత్రం దాఖలు చెయ్యాలన్న కోర్టు ఆదేశం

రంగులు తొలగించి ప్రమాణ పత్రం దాఖలు చెయ్యాలన్న కోర్టు ఆదేశం

పిటిషనర్ తరఫున న్యాయవాది శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో రంగులను తొలగించి ప్రమాణపత్రం దాఖలు చేయాలని హైకోర్టు గతంలోనే ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు నేడు ఏపీ ప్రభుత్వం భవిష్యత్తులో ఏ ప్రభుత్వ కార్యాలయాలకు వైసిపి రంగులు వేయబోమని ప్రమాణపత్రం దాఖలు చేసింది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు జగన్ ప్రభుత్వం ఈ ప్రమాణ పత్రాన్ని దాఖలు చేసినట్లుగా సమాచారం. చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలకు మాత్రమే కాదు, గతంలో గ్రామ సచివాలయాలకు, వాటర్ ట్యాంకులకు, చివరికి స్మశానాలకు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులనే వేయడం అప్పట్లో ఏపీలో దుమారం రేపింది.

2020లోనూ పంచాయతీ కార్యాలయాలకు రంగులు తొలగించాలన్న కోర్టు

2020లోనూ పంచాయతీ కార్యాలయాలకు రంగులు తొలగించాలన్న కోర్టు

2020లో ఏప్రిల్ నెలలో రాష్ట్రంలోని పంచాయతీ కార్యాలయాలకు వైయస్సార్ పార్టీ జెండాను పోలిన రంగులను తొలగించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కోర్టు ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. గతంలో కూడా కోర్టు వైసిపి రంగుల విషయంలో ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ కార్యాలయాలకు ఎటువంటి పార్టీ రంగులు వేయబోమని ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసింది.

కోర్టు ముందు తప్పు మళ్ళీ మళ్ళీ చెయ్యమని ప్రమాణ పత్రం ద్వారా చెప్పిన ఉన్నతాధికారులు

కోర్టు ముందు తప్పు మళ్ళీ మళ్ళీ చెయ్యమని ప్రమాణ పత్రం ద్వారా చెప్పిన ఉన్నతాధికారులు

కోర్టు అనేక సార్లు ఏపీ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినా తీరు మార్చుకోకుండా పదేపదే ఇలాంటి పనులు చేస్తూనే ఉంది. ఏపీ హైకోర్టు కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో కోర్టు రంగులు తొలగించి, మళ్ళీ ఇలా పార్టీ రంగులు వెయ్యమని ప్రమాణం చెయ్యాలని ఆదేశించటంతో డెడ్ లైన్ ముగుస్తున్న నేపధ్యంలో ప్రమాణం చేశారు. ఉన్నతాధికారులు కోర్టు ముందు దోషులుగా తప్పు చేసినట్టు ఒప్పుకుని, ఇక ముందు చెయ్యమని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+