ఏపీలో ఫ్రీ గ్యాస్ సిలెండర్లపై సర్కార్ అలర్ట్..! ఇదే లాస్ట్ ఛాన్స్..!

ఏపీలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీ అయిన మహిళలకు ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకాన్ని గతేడాదే అమలు చేయడం ప్రారంభించింది. అయితే నాలుగు నెలలకోసారి ఒక్క గ్యాస్ సిలెండర్ చొప్పున ఏడాదికి మూడు సిలెండర్లను బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. దీని ప్రకారం డిసెంబర్ లో ప్రారంభమైన ఈ పథకంలో తొలి గ్యాస్ సిలెండర్ బుక్ చేసుకునే గడువు ఈ నెల 31 వరకే ఉంది. దీంతో ఆ లోపు బుక్ చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు.

తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందే అవకాశం మార్చి 31 వరకే ఉందని, ఇప్పటివరకు పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలని ఆహారం, పౌరసరఫరాల, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవాళ మరోసారి కోరారు. ప్రతి పేద ఆడబిడ్డకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలెండర్లు ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని, దీపం-2 పథకంలో తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు ఈ నెలాఖరు వరకే గడువు ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇప్పటివరకు 98 లక్షల మంది తొలి ఉచిత సిలిండర్ వినియోగించుకున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

ap government alert to free gas cylinders scheme beneficiaries- here are details

దీపం-2 పథకానికి రూ.2,684 కోట్లు కూటమి ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి నాదెండ్ల వెల్లడించారు. ఉచిత సిలిండర్ కావాల్సిన వారు సాధారణ పద్ధతిలో ముందుగా సొమ్ము చెల్లించవలసి ఉంటుందని, పట్టణ ప్రాంతాల్లో బుక్ చేసిన 24 గంటల లోపు, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల లోపు గ్యాస్ డెలివరీ ఇస్తారన్నారు. ఆ తర్వాత సిలెండర్ డెలివరీ అయిన 48 గంటల్లోపు చెల్లించిన పూర్తి సొమ్మును లబ్దిదారుల ఖాతాల్లో తిరిగి జమ అవుతుందన్నారు. ఒక సంవత్సరంలో 3 గ్యాస్ సిలిండర్లు ఇలా ఉచితంగా పంపిణీ చేస్తారని, వీటిని ఒకేసారి కాకుండా నాలుగు నెలలకు ఒకసారి బుక్ చేసుకునే అవకాశం కల్పించారన్నారు.

ap government alert to free gas cylinders scheme beneficiaries- here are details

ప్రతి ఏడాది ఏప్రిల్ -జూలై (01), ఆగష్టు -నవంబర్ (01), డిసెంబర్ -మార్చి (01) మధ్య ఉచిత గ్యాస్ సిలెండర్ బుక్ చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి అర్హతలుగా ఎల్.పి.జి.కనెక్షన్ కలిగి ఉండటం, రైస్ కార్డ్, ఆథార్ కార్డు, ఆధార్ కార్డుతో రైస్ కార్డుతో అనుసంధానం అయి ఉండాలని తెలిపారు. ఎటువంటి సమాచారం లోపం ఉన్న టోల్ ఫ్రీ నెం.1967 కు ఫోన్ చేసి ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+