ఏపీలో ఆగస్టు 15న జెండా ఎగరేసే మంత్రులు వీరే..! చంద్రబాబు, పవన్ ఎక్కడంటే.. ?
ఏపీలో ప్రతీ ఏటా జరిగే తరహాలోనే స్వాతంత్ర దినోత్సవం రోజున పతాకావిష్కరణకు మంత్రుల్ని ఎంపిక చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి జెండా ఆవిష్కరణ వేడుక కావడంతో ఏయే మంత్రులకు ఏయే జిల్లాలు కేటాయించారన్నది ఆసక్తి రేపుతోంది. ప్రభుత్వం ఇవాళ విడుదల చేసిన జాబితాలో 25 జిల్లా కేంద్రాల్లో జెండా ఆవిష్కరించేందుకు ఎంపిక చేసిన మంత్రుల జాబితా ఇలా ఉంది.
విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రస్థాయి స్వాతంత్ర వేడుకలు నిర్వహిస్తోంది. నగరంలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో సీఎం చంద్రబాబు పతాకావిష్కరణ చేస్తారు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన మంత్రులు కూడా ఇందులో హాజరవుతారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో పతాకావిష్కరణ చేయనున్నారు. నారా లోకేష్ గుంటూరులోనూ, అచ్చెన్నాయుడు శ్రీకాకుళంలోనూ జెండాలు ఎగరేస్తారు.

కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో, నాదెండ్ల మనోహర్ నరసరావుపేటలో, నారాయణ నెల్లూరులో, వంగలపూడి అనిత అనకాపల్లిలో, సత్యకుమార్ చిత్తూరులో, నిమ్మల రామానాయుడు భీమవరంలో, ఫరూక్ కడపలో, ఆనం రామనారాయణరెడ్డి తిరుపతిలో, పయ్యావుల కేశవ్ అనంతపురంలో, అనగాని సత్యప్రసాద్ విశాఖలో, పార్ధసారధి ఏలూరులో, డోలా బాలవీరాంజనేయస్వామి ఒంగోలులో, గొట్టిపాటి రవి బాపట్లలో, కందుల దుర్గేష్ రాజమండ్రిలో జెండా ఎగరవేయనున్నారు.
అలాగే గుమ్మిడి సంధ్యారాణి పార్వతీపురంలో, బీసీ జనార్ధన్ రెడ్డి నంద్యాలలో, టీజీ భరత్ కర్నూలులో, సవిత పుట్టపర్తిలోనూ, వాసంశెట్టి సుభాష్ అమలాపురంలోనూ, కొండపల్లి శ్రీనివాస్ విజయనగరంలోనూ, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటిలోనూ జెండా ఎగరవేయనున్నారు. అయితే అల్లూరి సీతారామరాజు జిల్లాకు మాత్రం కలెక్టర్ దినేష్ కుమార్ ను జెండా ఎగరవేసేందుకు ప్రభుత్వం ఎంపిక చేసింది.












Click it and Unblock the Notifications
