ఆటో డ్రైవర్ల ఖాతాల్లో రూ 15 వేలు - వర్తింపు వీరికే, మార్గదర్శకాలు..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు వాహనమిత్ర అమలు పైన ప్రకటన చేసారు. దసరా నుంచి ఈ పథకం అమల్లో భాగంగా అర్హత ఉన్న ప్రతీ ఆటో డ్రైవరు ఖాతాలో రూ 15 వేలు జమ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే లబ్దిదారులు.. ఖర్చు.. నిధుల కేటాయింపు పైన కసరత్తు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2.90 లక్షల మంది ఆటో డ్రైవర్లకు పథకం అమలు కానుంది. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు అర్హత ఉన్న ప్రతీ ఆటో డ్రైవరుకు లబ్ది అందనుంది. నిధుల వినియోగం పైన ప్రభుత్వం విధి విధానాలు ఖరారయ్యాయి.
దక్కేది వీరికే
ఏపీ ప్రభుత్వం మరో పథకం అమలుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా తాము ఆదాయం కోల్పోతున్నామని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వాహన మిత్ర అమలు చేయాలని డిమాండ్ చేసారు. దీంతో, తాజాగా అనంతపురం సభలో ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర కింద రూ.15000 చొప్పున సాయం అందించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో 2.90 లక్షల మంది డ్రైవర్లకు ఆర్థికసాయం అందనుంది. మొత్తంగా వారు రూ.435 కోట్ల మేర లబ్ధి పొందనున్నారు. వైసీపీ హయాంలోవాహనమిత్ర కింద రూ.10 వేల చొప్పున మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారికి రూ.15000 ఇవ్వాలని నిర్ణయించింది.

విధి విధానాలు
ప్రభుత్వం ఇప్పటికే ఈ పథకం అమలు విధి విధానాలను ఖరారు చేసింది. సొంత వాహనం ఉండి దాన్ని నడిపే డ్రైవర్లకు ఈ పథకం వర్తిస్తుంది. 2023-24లో ఈ పథకం కింద 2.75 లక్షల మంది అర్హులున్నారు. ఇందులో ఆటో డ్రైవర్లు 2.5 లక్షల మంది, ట్యాక్సీ, మ్యాక్సీక్యాబ్‌ల డ్రైవర్లు 25 వేల మంది ఉన్నారు. తాజాగా వీరి సంఖ్య మరో 15 వేల వరకు పెరిగే అవకాశం ఉందని రవాణా శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ సారి 2.90 లక్షల మందికి ఆర్థిక సాయం అందుతుందని చెబుతున్నారు. రవాణా శాఖ ఉన్నతాధికారులు రాష్ట్రంలో ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీక్యాబ్‌లు ఎన్ని ఉన్నాయి, వాటి యజమానుల్లో ఎంత మంది డ్రైవింగ్ చేస్తూ ఉపాధి పొందుతున్నారనే తదితర వివరాలు సిద్దం చేసారు. ప్రతి డ్రైవర్ ఖాతాలో నేరుగా రూ.15,000 డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా జమ కానుంది.
వినియోగం ఇలా
ఇక, ఈ నిధులను ఈ సాయం వాహన బీమా, టైర్ల మార్పులు, ఇంధన ఖర్చులు, కుటుంబ అవసరాలు వంటి విషయాలకు ఉపయోగపడనుంది. దీంతో పాటుగా ఆటో రిపేర్లు, సర్వీసింగ్ ఖర్చులకు వినియోగించుకోవచ్చని చెబుతున్నారు. బీమా రీన్యువల్ కోసం ఉపయోగించుకునే వెసులుబాటు కలుగుతుంది. పిల్లల చదువుల కోసం సాయం అవుతుందని భావిస్తున్నారు. డ్రైవర్లకు కుటుంబ ఆర్థిక భారాన్ని కొంతవరకు తగ్గించేందుకు ఉపకరిస్తుంది. ఆటో డ్రైవర్లు సాధారణంగా రోజువారీ ఆదాయంపైనే ఆధారపడతారు. ఇంధన ధరలు పెరగడం, వాహనాల నిర్వహణ ఖర్చులు ఎక్కువ కావడం వల్ల చాలా మంది డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయం వారికి ఉప శమనంగా మారనుంది.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!!












Click it and Unblock the Notifications