ఏపీలో మరో నామినేటెడ్ పోస్టుల పందేరం-38 ఏఎంసీ ఛైర్మన్ల ప్రకటన..!

ఏపీలో కూటమి ప్రభుత్వం ఇవాళ మరో విడత నామినేటెడ్ పోస్టుల్ని ప్రకటించింది. ఇందులో 38 వ్యవసాయ మార్కెట్ యార్డు ఛైర్మన్ల పదవులు ఉన్నాయి. త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీల ఛైర్మన్లను ప్రకటించనున్నట్లు వెల్లడించింది. వీటిలో టీడీపీ 31 ఏఎంసీ ఛైర్మన్ పోస్టుల్ని తమ నాయకులకు కేటాయించుకుంది. మరో 6 పోస్టుల్ని జనసేనకు, మరో పోస్టు బీజేపీకి ఇచ్చింది. తద్వారా కూటమి పార్టీల్లో అసంతృప్తి లేకుండా చూసుకుంది.

ప్రభుత్వం విడుదల చేసిన వ్యవసాయ మార్కెట్ యార్డు ఛైర్మన్ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.టీడీపీ నుంచి తుని ఏఎంసీ చైర్మన్ గా అంకంరెడ్డి రమేశ్, రాప్తాడులో సుధాకర్ చౌదరి, ప్రత్తిపాడులో బడ్డి మణి, గుడివాడలో ఛాత్రగడ్డ రవి కుమార్, పుత్తూరులో డీఎస్ గణేష్, దర్శిలో దారం నాగవేణి, పాయకరావుపేటలో దేవర సత్యనారాయణ, గన్నవరంలో గరికపాటి శివశంకర్, వేమూరులో గొట్టిపాటి జయవెంకట పూర్ణకుమారి, పర్చూరులో గుంజి వెంకట్రావు, ఈపూరులో జరపల రాములుబాయి, విజయనగరంలో కర్రోతు వెంకట నర్సింగరావు, పాలకొల్లులో కోడి విజయభాస్కర్, చీరాలలో కౌతారపు జనార్ధన్ రావు, మద్దిపాడులో మన్నం రాజేశ్వరి, రేపల్లెలో మత్తి అనురాధకు అవకాశం ఇచ్చారు.

ap government announced amc chairmans for 38 market yards tdp took 31 jansena 6 bjp 1

అలాగే వినుకొండలో మీసాల మురళీకృష్ణ, రొంపిచర్లలో మొండితోక రాణి, పెద్దాపురంలో నూనే మంగలక్ష్మి, కూచినపూడిలో ఓగిబోయిన వెంకటేశ్వరరావు, గజపతినగరంలో పీవీవీ గోపాల రాజు, నరసన్నపేటలో పగోటి ఉమా మహేశ్వరి, కంభంలో పూనూరు భూపాల్ రెడ్డి, తిరువూరులో రేగళ్ల లక్ష్మీ అనిత, కమలాపురంలో సింగిరెడ్డి రాఘవరెడ్డి, జలుమూరులో తర్రా బలరాం, సంతమాగూలూరులో తేలప్రోలు రమేశ్, రాయదుర్గంలో ఉండాల హనుమంతరెడ్డి, దుగ్గిరాలలో ఉన్నం ఝాన్సీరాణి, నందికొట్కూరులో వీరం ప్రసాదరెడ్డి, గోపాలపురంలో యద్దనపూడి బ్రహ్మరాజు, కనిగిరిలో యరవ రమాదేవికి ఛాన్స్ దక్కింది.

జనసేన తరఫున రాజాంలో పొగిరి కృష్ణవేణి, భీమిలిలో కురిమిని రామస్వామి నాయుడు, అలమూరులో కొత్తపల్లి వెంకటలక్ష్మి, పెడనలో భీముని అనంతలక్ష్మి, ఉండిలో జుత్తుగ నాగరాజుకు అవకాశం ఇచ్చారు. అలాగే బీజేపీ తరపున యర్రగుంట్లలో రామిరెడ్డిపల్లి నాగరాజుకు ఏఎంసీ ఛైర్మన్ గా ఛాన్స్ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+