AP Police Recruitment: ఏపీలో కానిస్టేబుల్ తుది పరీక్ష తేదీ ఖరారు..!

ఏపీలో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్ధులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఇప్పటికే అన్ని పరీక్షలు పూర్తయినా తుది వ్రాత పరీక్ష మాత్రం మిగిలి ఉంది. దీంతో ఈ పరీక్ష నిర్వహణ కోసం ప్రభుత్వం తేదీ, సమయం ఖరారు చేసింది. అలాగే రాష్ట్రంలోని ఐదు పరీక్ష కేంద్రాల్ని వీటి కోసం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. వీటి వివరాలు ఓసారి తెలుసుకుందాం..

కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం తుది రాతపరీక్షను జూన్ 1న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 1న ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకూ పరీక్ష జరగనుంది. ఏపీలోని విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో మొత్తం 38,910 మంది అభ్యర్ధులు పరీక్ష రాయనున్నారు. వీరు తమకు సమీపంలో ఉన్న పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

ap government announced date and time for final written test of constable recruitment

ఏపీలో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం 2023 జనవరి 22న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో 4.59 లక్షల మంది అభ్యర్ధులు హాజరయ్యారు. వీరిలో 95208 మంది అభ్యర్ధులు క్వాలిఫై అయ్యారు. వీరికి గతేడాది డిసెంబర్ 30న ఫిజికల్ టెస్టు నిర్వహించారు. ఇందులో 38910 మంది అభ్యర్ధులు క్వాలిఫై అయ్యారు. వీరికి ఇప్పుడు జూన్ 1న తుది వ్రాత పరీక్ష నిర్వహించనున్నారు.

జూన్ 1న కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిర్వహించే వ్రాత పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలతో ఒకే పేపర్ గా ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్ధులు https://slprb.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి తెలుసుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. ఈ వెబ్ సైట్ లోనే ఫైనల్ గా ఎంపికైన అభ్యర్ధుల వివరాలు కూడా ఇవ్వనున్నట్లు తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+