ఏపీలో స్కూళ్లకు దసరా సెలవుల ప్రకటన..! ఇదే ఫైనల్..!
ఏపీలో దసరా సందర్భంగా ప్రతీ ఏటా ఇచ్చినట్లే ఈసారి కూడా సెలవులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఇప్పటికే ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఇచ్చిన సెలవుల్ని పొడిగించాలనే డిమాండ్ల నేపథ్యంలో ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈసారి స్కూళ్లకు దసరా సెలవులు ఇచ్చేందుకు విద్యాశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు.
రాష్ట్రంలో ఈసారి ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పాఠశాలలకు దసరా సెలవుల్ని సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకూ ఇచ్చారు. అయితే దసరా పండుగ ఈ నెల 22నే ప్రారంభం కానున్న నేపథ్యంలో సెలవుల్ని రెండురోజుల ముందు నుంచే ఇవ్వాలనే డిమాండ్లు వచ్చాయి. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ నెల 21 నుంచే దసరా సెలవుల్ని ప్రకటించింది. దీంతో ఏపీలోనూ 21 లేదా 22 నుంచే దసరా సెలవులు ఇవ్వాలనే డిమాండ్లు వచ్చాయి.

అయితే ప్రభుత్వం మాత్రం అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకూ మాత్రమే దసరా సెలవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మొత్తం 9 రోజులు మాత్రమే విద్యార్ధులకు దసరా సెలవులు లభించనున్నాయి. వచ్చే నెల 3న తిరిగి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. జూనియర్ కాలేజీలకు మాత్రం ఈ నెల 28 నుంచి అక్టోబర్ 5 వరకూ సెలవులు ప్రకటిస్తున్నారు.
ప్రతీ విద్యాసంవత్సరంలో దసరా సెలవులు కీలకమైనవి. ఇందుకోసం ప్రభుత్వం ముందుగానే అకడమిక్ క్యాలెండర్ లోనే క్లారిటీ ఇచ్చేస్తుంది. కానీ ప్రతిసారీ దసరా సెలవుల పెంపు కోసం డిమాండ్లు వినిపిస్తూనే ఉంటాయి. దీనిపై ప్రభుత్వాలు అందరి అభిప్రాయాలు తీసుకుని నిర్ణయం తీసుకుంటాయి. ఈసారి కూడా సెలవుల పొడిగింపుపై డిమాండ్లు వినిపించినా అంతిమంగా అకడమిక్ క్యాలెండర్ నే అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications