Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో మహిళలకు శుభవార్త.. వారికి ఏడాదికి 25లక్షలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏపీలో అన్ని వర్గాల సంక్షేమం కోసం విశేషంగా కృషి చేస్తుంది. ముఖ్యంగా మహిళలకు సంబంధించి అనేక పథకాలను అందించి వారి ఆర్థిక అభివృద్ధికి, ప్రగతికి దోహదం చేస్తుంది. ముఖ్యంగా ఏపీలోని డ్వాక్రా గ్రూపు మహిళల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇన్ని అన్ని కావు. డ్వాక్రా గ్రూపు మహిళల కోసం 2025 అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సఖి సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించింది.

26.53 లక్షల మంది డ్వాక్రా మహిళలకు బెనిఫిట్
ఈ పథకం ద్వారా పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుపేద డ్వాక్రా మహిళలకు ఆరోగ్య రక్షణ కల్పించడం ప్రధాన ఉద్దేశంగా పెట్టుకుంది. లైఫ్ స్టైల్ డిసీజెస్, క్యాన్సర్లను ముందుగానే గుర్తించి చికిత్స అందించడం ప్రధాన ఉద్దేశంగా పెట్టుకున్న ఏపీ ప్రభుత్వం 2026 జనవరి నాటికి ఈ కార్యక్రమాన్ని విస్తరించి 26.53 లక్షల మంది డ్వాక్రా మహిళలను లక్ష్యంగా పెట్టుకొని ఆరోగ్య రక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

AP Government Announces Good News for DWCRA Women Free Healthcare and 25 Lakh Cashless Treatment under Sakhi Suraksha

ఇప్పటివరకు 76 వేల మందికి పైగా డ్వాక్రా మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు
ఈ సఖి సురక్ష పథకం ద్వారా లక్ష మందికి పరీక్షలు చేయాలని లక్ష్యం పెట్టుకున్నప్పటికీ ఇప్పటివరకు 76 వేల మందికి పైగా మహిళలు ఉచిత వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ పథకం ద్వారా 16 రకాల ఉచిత వైద్య పరీక్షలు చేయడమే కాకుండా, బ్రెస్ట్, సర్వైకల్, ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ మరియు మానసిక ఆరోగ్యానికి సలహాలు, సూచనలు అందిస్తారు.

25 లక్షల వరకు నగదు రహిత చికిత్స
ఈ పరీక్షలలో తీవ్రమైన వ్యాధులు గుర్తించిన వారికి ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పథకాల కింద సంవత్సరానికి 25 లక్షల వరకు నగదు రహిత చికిత్సను అందిస్తారు ఇప్పటివరకు 14 వేల మందికి పైగా మహిళలు ఈ పథకం ద్వారా ఆసుపత్రులలో చికిత్సను పొందారు. ఈ సఖి సురక్ష పథకం ద్వారా ప్రతి 40 నుండి 50 మంది మహిళలకు ఒక హెల్త్ రిసోర్స్ పర్సన్ ను నియమించి సేవలు అందిస్తారు.

పట్టణ ప్రాంతాల పేద మహిళలకు బెనిఫిట్
వారి ఆరోగ్యానికి సంబంధించి ఆస్పత్రిలో చేరిక నుంచి ఫాలోఅప్ వరకు సహాయం లభిస్తుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల వారికి బెనిఫిట్ చేస్తే ఈ పథకం పట్టణ ప్రాంతంలోని పేద మహిళలకు నిజంగా వరంగా మారింది. మల్టీ టాస్కింగ్ చేసే మహిళలు ఆరోగ్య విషయంలో పెద్దగా దృష్టి సారించకపోవడంతో, ప్రభుత్వం ఆ బాధ్యతను తీసుకొని మహిళల ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకొచ్చింది. సఖి సురక్ష పథకం ద్వారా మహిళల ఆరోగ్యానికి భరోసా ఇచ్చి వారికి 25 లక్షల రూపాయల వరకు చికిత్సను కూడా ఇస్తున్న ఏపీ సర్కార్ ఈ పరిధిని మరింత విస్తరించాలని భావిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+