ఏపీలో 5 ప్రధాన ఆలయాలకు కొత్త ఛైర్మన్లు..! టీటీడీ స్థానిక కమిటీలకూ..!

ఏపీలో కూటమి సర్కార్ మరోసారి నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసింది. ఇప్పటికే నామినేటెడ్ పదవుల భర్తీలో ఆలస్యం జరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో ఇవాళ రాష్ట్రంలోని ఐదు ప్రధాన ఆలయాల బోర్డులకు ఛైర్మన్లను నియమించింది. వీటితో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుల నియామకాలు కూడా చేసింది. దీంతో దేవాదాయశాఖకు సంబంధించి కీలక పదవుల్ని భర్తీ చేసినట్లయింది.

రాష్ట్రంలోని వివిధ దేవాలయాల బోర్డులకు ఛైర్మన్లను నియమిస్తూ కూటమి ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో
శ్రీశైలంలోని శ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికి ఛైర్మన్ గా పోతుగుంట రమేశ్ నాయుడు, శ్రీకాళహస్తిలోని శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఛైర్మన్ గా కొట్టె సాయి ప్రసాద్, కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ఛైర్మన్ గా వి.సురేంద్ర బాబు (మణి నాయుడు) ను నియమించారు.

AP Government Appoints Chairmen to 5 Temple Boards and TTD Local Advisory Committee Presidents

అలాగే కీలకమైన విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఛైర్మన్ గా బొర్రా రాధాకృష్ణ (గాంధీ)కి అవకాశం కల్పించారు. చివరిగా కోనసీమ జిల్లాలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర ఆలయం ఛైర్మన్ గా ముదునూరి వెంకట్రాజును నియమించారు. దీంతో పాటు టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీలకు ప్రెసిడెంట్లను కూడా నియమించారు. వీటిలో హైదరాబాద్ జూబ్లీహిల్స్ టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీకి అధ్యక్షుడిగా ఏ.వి.రెడ్డిని, హిమాయత్ నగర్ టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడిగా నేమూరి శంకర్ గౌడ్ ను నియమించారు.

AP Government Appoints Chairmen to 5 Temple Boards and TTD Local Advisory Committee Presidents

అలాగే బెంగళూరులోని టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడిగా వీరాంజనేయులను, ఢిల్లీ టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడిగా ఎదుగుండ్ల సుమంత్ రెడ్డిని, ముంబై టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడిగా గౌతమ్ సింగానియాని, విశాఖపట్నంలోని టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడిగా చోడే వెంకట పట్టాభిరామ్ ను నియమించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+