ఏపీలో జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రుల ప్రకటన-పవన్, లోకేష్ కు మాత్రం నో...!
ఏపీ ప్రభుత్వం ఇవాళ అన్ని జిల్లాలకు ఇన్ చార్జ్ మంత్రులను నియమించింది. రాష్ట్రంలోని 26 జిల్లాలకు కేబినెట్ లో ఉన్న 25 మంత్రుల్ని ఇన్ ఛార్జ్ లుగా నియమించారు. దీంతో వారు తమ సొంత జిల్లాలతో పాటు ఆయా జిల్లాలను కూడా పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ జాబితాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు కీలక మంత్రి నారా లోకేష్ కు మాత్రం ఏ జిల్లాలను కేటాయించకపోవడం విశేషం.
ఏపీలో మంత్రుల్ని పలు జిల్లాలకు ఇన్ చార్జ్ లను నియమించినా పవన్, లోకేష్ కు మాత్రం ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. దీంతో నలుగురు మంత్రులకు రెండేసి జిల్లాల బాథ్యతలు అప్పగించారు. కింజరాపు అచ్చెన్నాయుడుకు మన్యం జిల్లా ఇన్ ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. దీంతోపాటు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్ఛార్జీ బాధ్యతలూ అప్పగించారు.అలాగే నిమ్మల రామానాయుడికి తూర్పు గోదావరి, కర్నూలు జిల్లాల బాధ్యతలు ఇచ్చారు.

గొట్టిపాటి రవికి పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాల బాధ్యతలు అప్పగించారు. అనగాని సత్యప్రసాద్ కు సత్యసాయి, తిరుపతి జిల్లాల బాధ్యతలు అప్పగించారు. విజయనగరం జిల్లాకు హోంమంత్రి అనితను, శ్రీకాకుళం జిల్లాకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ను, విశాఖ జిల్లాకు బాలవీరాంజనేయస్వామిని, అల్లూరి జిల్లాకు సంధ్యారాణిని, అనకాపల్లి జిల్లాకు కొల్లు రవీంద్రను, కాకినాడ జిల్లాకు నారాయణను, ఎన్టీఆర్ జిల్లాకు సత్యకుమార్ ను, కృష్ణా జిల్లాకు వాసంశెట్టి సుభాష్ ను కేటాయించారు.
అలాగే గుంటూరు జిల్లాకు కందుల దుర్గేష్ ను, బాపట్ల జిల్లాకు పార్థసారథిని, ప్రకాశం జిల్లాకు ఆనం రామనారాయణరెడ్డిని, నెల్లూరు జిల్లాకు ఫరూఖ్ ను, నంద్యాల జిల్లాకు పయ్యావుల కేశవ్ ను కేటాయించారు. అనంతపురం జిల్లాకు టీజీ భరత్ ను, కడప జిల్లాకు సవితను, అన్నమయ్య జిల్లాకు బీసీ జనార్ధన్‌రెడ్డిని, ఏలూరు జిల్లాకు నాదెండ్ల మనోహర్ ను, చిత్తూరు జిల్లాకు రాంప్రసాద్‌రెడ్డిని కేటాయించారు.












Click it and Unblock the Notifications