AP Fibernet : ఏపీలో ఫైబర్ నెట్ ఛార్జీల పెంపు? సర్కార్ క్లారిటీ ఇదే..! తాజా మార్పులివే..

ఏపీలో ఫైబర్ నెట్ ఛార్జీలు పెరగబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ దీనిపై క్లారిటీ ఇచ్చింది.

ఏపీ ఫైబర్ నెట్ బేసిక్ ప్లాన్ ధరలు పెంచుతున్నట్లుగా ఈ మధ్య రాష్ట్రంలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ప్యాకేజీలతో నడిపే పరిస్దితి లేకపోవడంతో ఛార్జీలు పెంచుతున్నారనేది ఈ వార్తల సారాంశం. అయితే దీన్ని ఇవాళ ఫైబర్ నెట్ కార్పోరేషన్ ఛైర్మన్ గౌతంరెడ్డి ఖండించారు.

రాష్ట్ర ప్రభుత్వానికి బేసిక్ ప్లాన్ ధరలు పెంచే ఆలోచన లేదని ఫైబర్ నెట్ కార్పోరేషన్ ఛైర్మన్ గౌతంరెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఏపీ ఫైబర్ నెట్ ద్వారా రూ.190 లకే ఇంటర్నెట్ సేవలందిస్తున్నామన్నారు. త్వరలో రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి ప్రాంతాల్లో ఏపీ ఫైబర్ నెట్ బాక్సుల సర్వీస్ సెంట్లర్లను ఏర్పాటు చేయబోతున్నట్టు గౌతంరెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఏపీఎస్ఎఫ్ఎల్ బోర్డు మీటింగ్ తీర్మానాలు, నిర్ణయాలు, భవిష్యత్ కార్యాచరణను తెలియజేశారు.

APSFLలో ఎన్నో మార్పులు తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మారుమూప్రాంతాలకు సైతం విస్తరించి అత్యధిక స్పీడ్ తో ఇంటర్నెట్ సేవలు అందిస్తోందని గౌతంరెడ్డి తెలిపారు. జగనన్న కాలనీలు, టిడ్కో గృహాల్లో కూడా ఏపీ ఫైబర్ నెట్ వాడేలా కీలక నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ కాలనీల్లో ఏపీ ఫైబర్ నెట్ ను తొలగించి బయటి నెట్ వర్క్ లను వినియోగిస్తే ఏపీఎస్ఎఫ్‌ఎల్ ఆధ్వర్యంలో చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇప్పటికే పలు ప్రాంతాల జగనన్న కాలనీలు, టిడ్కో గృహాల్లో ఏపీ ఫైబర్ నెట్ వినియోగం జరిగేలా కార్యక్రమాలు చేపట్టామన్నారు.

ap government clarified on fibernet charges hike.. here are details

ఏపీ ఫైబర్ నెట్ ప్రస్తుతం 6లక్షల కనెక్షన్లుకు పైగా సేవలు అందిస్తోందని ఉందని గౌతంరెడ్డి తెలిపారు. అయితే కనెక్షన్ల సంఖ్యను మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 55వేల కిలోమీటర్ల వరకు ఏపీ ఫైబర్ నెట్ విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం 33వేల కిలోమీటర్లలో పనులు జరుగుతున్నాయని, అలాగే 27 వేల కిలోమీటర్లలో ఏపీ ఫైబర్ నెట్ ట్రెండింగ్ లో ఉందన్నారు. ఏపీ ఫైబర్ నెట్ బాక్సుల సర్వీస్‌కు, కొత్త బాక్సుల ఆర్డర్లకు ఇకపై టెండర్ల విధానం అవలంబించాలని..రాష్ట్రంలో సొంతంగా ఫైబర్ నెట్ బాక్సుల మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఎవరైనా ఔత్సాహికులు ఉంటే ముందుకు రావచ్చన్నారు. త్వరలో హాట్ స్టార్, ఆహా తరహాలో APSFL ద్వారా సొంతంగా యాప్ ప్రారంభిస్తున్నట్లు గౌతంరెడ్డి ప్రకటించారు. APSFL యాప్ లో సినిమాలు, వీడియోలు, ప్రముఖుల ప్రసంగాలు చూడొచ్చని..అలాగే థియేటర్లలో సినిమా విడుదలైన రోజే APSFL యాప్ లో వీక్షించవచ్చని వివరించారు.

కొత్తగా ఏర్పాటు చేయబోయే సర్వీస్ సెంటర్లకు బాక్సులను ఆపరేటర్లే తీసుకువెళ్లి సర్వీస్ చేయించేలా..దానికి కూడా ఒక రేటంటూ ఉండేలా నిర్ణయం తీసుకున్నట్లు గౌతంరెడ్డి వెల్లడించారు. బీబీఎన్ఎల్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రానికి రూ.500కోట్లు వచ్చాయని ఇంకా రూ.500 కోట్లు రావాల్సి ఉందన్నారు. అందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా 50 లక్షల వరకు బాక్సులు అవసరమని..ప్రస్తుతానికి 20 లక్షల బాక్సులకు టెండర్లు కోరనున్నట్టు చెప్పారు. అయితే ఆపరేటర్లు, ఎంఎస్‌వోలు కలసికట్టుగా ఉన్నట్లయితే ధరలు పెరిగే అవకాశం ఉండదని..ఆ మేరకు అందరూ సహకరించాలని గౌతంరెడ్డి కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+