టీచర్లుగా ఎంపికైన పోలీసులు..! ఖాళీల భర్తీపై సర్కార్ క్లారిటీ..!
ఏపీలో కూటమి సర్కార్ తాజాగా మెగా డీఎస్సీని విజయవంతంగా పూర్తి చేసింది. దీని ద్వారా రాష్ట్రంలో ఏకంగా 16 వేలకు పైగా ఉపాధ్యాయ ఖాళీల్ని భర్తీ చేసింది. మెగా డీఎస్సీ సక్సెస్ ఫుల్ లా పూర్తి చేయడంపై ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. డీఎస్సీకి వ్యతిరేకంగా కోర్టుల్లో 70కి పైగా కేసులు దాఖలైనా వాటిని సవాల్ గా తీసుకుని భారీ రిక్రూట్ మెంట్ ను విజయవంతంగా పూర్తి చేసిన మంత్రి నారా లోకేష్ కు మంత్రులు అభినందనలు తెలిపారు.
అయితే ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో ఇప్పటికే ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు కూడా పరీక్షలు రాసి ఎంపికయ్యారు. ఇలా ఒక్క పోలీసు శాఖలోనే 400 మంది సిబ్బంది మెగా డీఎస్సీ ద్వారా టీచర్లు కాబోతున్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో వారి స్ధానాలను భర్తీ చేసేందుకు పోలీసు శాఖలోనూ మరో రిక్రూట్ మెంట్ చేపట్టేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే ఇందులో కొన్ని న్యాయపరమైన చిక్కులున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో ఇతర శాఖలకు చెందిన ఉద్యోగులు ఎంపిక కావడంతో వారిని వారి మాతృశాఖల నుంచి రిలీవ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆయా శాఖల్లో ఖాళీలను కూడా భర్తీ చేయాల్సి ఉంటుంది. లేకపోతే పాలనాపరమైన సమస్యలు తప్పవు. అయితే వీటికి న్యాయపరమైన అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ మేరకు చర్యలు ప్రారంభించాలని మంత్రి నారా లోకేష్ సహచర మంత్రులకు కేబినెట్లో సూచించారు. దీంతో వారు కూడా సరేనన్నారు.












Click it and Unblock the Notifications