చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రభుత్వం కఠినంగానే - నారాయణ బెయిల్ పై హైకోర్టుకు : వదిలిపెట్టబోమంటూ..!!

|
Google Oneindia TeluguNews

మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు కోరుతూ హైకోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో రాజకీయ కక్ష సాధింపు లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ మేరకు పిటీషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. పదో తరగతి ప్రశ్నా పత్రాల మాల్ ప్రాక్టీసు...విచారణ అంశం పైన ప్రభుత్వంలో సమీక్ష చేసారు. నారాయణ ఆదేశాల మేరకు అక్రమాలు చేసినట్లు కళాశాల డీన్ బాలగంగాధర్ పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ ను ప్రభుత్వ సలహాదారు సజ్జల వివరించారు. నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఫ్యాక్టరీల్లా తయారయ్యారంటూ ఆయన ఫైర్ అయ్యారు.

మరో విద్యా సంస్థ పైనా చర్యలు తప్పవా

మరో విద్యా సంస్థ పైనా చర్యలు తప్పవా

మాల్ ప్రాక్టీస్​లో చైతన్య విద్యాసంస్థల ప్రమేయం కూడా ఉందని.. వారినీ వదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. మాల్ ప్రాక్టీస్ వెనుక ఎవరున్నా.. ప్రభుత్వం వదలిపెట్టదని స్పష్టం చేసారు. నారాయణను అరెస్ట్ చేసిన పోలీసులు అర్ద్రరాత్రి ఒంటి గంట తరువాత జడ్జి ఎదుట ప్రవేశ పెట్టారు. రెండున్నార గంటలకు సైగా సుదీర్ఘంగా చర్చలు జరిగినట్లు చెబుతున్నారు. నారాయణ తరపు వాదనలు వినిపించిన న్యాయవాదులు...2014 లో విద్యాసంస్థల అధినేతగా నారాయణ వైదొలిగారని నారాయణ తరపు న్యాయవాదులు కోర్టు ముందు సంబంధిత పత్రాలను సమర్పించారు.

నారాయణ బెయిల్ పై హైకోర్టుకు

నారాయణ బెయిల్ పై హైకోర్టుకు


పూర్వాపరాలను పరిశీలించిన తరువాత జడ్జి పోలీసుల నేరారోపణలు నమ్మేలా లేవని అభిప్రాయపడ్డారు. తెల్లవారుజామున 3.50 గంటలకు నారాయణకు బెయిల్ మంజూరు అయింది. అయితే, నారాయణ రిమాండ్ రిపోర్టులో నారాయణ సాక్షుల్ని ప్రభావితం చేయగలరని పోలీసులు పేర్కొన్నారు. ఆయన సాక్ష్యాలను టాంపర్ చేయకుండా..జ్యుడిషియల్ రిమాండ్ విధించాలని కోరారు. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయని.. ఆయనను స్వేచ్చగా తిరగనిస్తే ఆ పరీక్షల్లోనూ మాల్ ప్రాక్టీసు పాల్పడే అవకాశాలు ఉన్నాయంటూ వివరించారు.

నారాయణ రిమాండ్ రిపోర్టులో..

నారాయణ రిమాండ్ రిపోర్టులో..


అదే జరిగితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వేల మంది విద్యార్ధుల కెరీర్ దెబ్బతింటుందని అందులో పేర్కొన్నారు. అయితే, నారాయణను రిమాండ్ రిపోర్టులో విద్యా శాఖ మంత్రిగా తప్పుగా పేర్కొన్న అంశం వెలుగులోకి వచ్చింది. ఇదే సమయంలో ప్రభుత్వం మాత్రం ఇంకోసారి నారాయణ లాగా తప్పుచేయాలని భావించే ఒంట్లో భయం పుట్టేలా సందేశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని సజ్జల స్పష్టం చేసారు. అదే విధంగా ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలోనూ ఆధారాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో..ఇప్పుడు ప్రశాపత్రాల మాల్ ప్రాక్టీసు విషయంలో ఏం జరగనుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.

English summary
AP Government move to high court seeking cancellation of ex minister Narayana bail in tenth papers leak case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X