Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు డబుల్ బొనాంజా..!

ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం ఇవాళ మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఇప్పటికే గత ఆర్దిక సంవత్సరంలో ఆస్తిపన్ను బకాయిలపై 50 శాతం వడ్డీ రాయితీ ఇచ్చిన ప్రభుత్వం.. ఈ నెలాఖరులోపు ప్రస్తుత ఆర్దిక సంవత్సర బకాయిలు చెల్లిస్తే 5 శాతం రాయితీ ఇస్తామని కూడా ప్రకటించింది. అయితే గతేడాది బకాయిల్ని వడ్డీ రాయితీతో కట్టే గడువు మార్చి 31తోనే ముగియగా.. ఈ సంవత్సరపు పన్ను రాయితీతో చెల్లించే గడువు మాత్రం నెలాఖరుతో ముగియనుంది.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పట్టణ స్ధానిక సంస్థల్లో 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు ఆస్తి పన్ను (భవనాలు మరియు ఖాళీ భూములు) బకాయిలపై విధించిన వడ్డీలో 50% మాఫీకి గత నెలతో ముగిసిన గడువును ఈ నెలాఖరు వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ , అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్ తెలిపారు..

ap government double bonanza for property tax payers extended 50 percent interest rebate deadline

ఈ గడువును అన్ని పట్టణ స్ధానిక సంస్థల్లో ఒకేసారి చెల్లించాలని, ఈ గడువును అసెస్సీ 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు మొత్తం ఆస్తి పన్ను బకాయిలను 30.04.2025న లేదా అంతకు ముందు ఒకేసారి 50% వడ్డీతో కలిపి చెల్లిస్తే, 2024-25 ఆర్థిక సంవత్సరంలో మరియు 30.04.2025 వరకు పన్ను చెల్లింపుదారులు 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు బకాయిలపై చెల్లించిన వడ్డీని భవిష్యత్తులో ఆస్తి పన్ను చెల్లింపులకు సర్దుబాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2024-25 తేదీ నాటికి 30.04.2025 నాటికి నగదు వాపసు చేయబడదని తెలిపారు.

గతంలో ప్రభుత్వం పట్టణ స్ధానిక సంస్థల్లో 2024-2025 సంవత్సరం వరకు ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీని ఒకేసారి మాఫీ చేయడానికి ఆదేశాలు జారీ చేసింది. అలాగే చివరి తేదీ 31-03-2025గా పేర్కొంది. కానీ ఈ ఉత్తర్వులు 25.03.2025న జారీ చేశారు. అంటే 2024-25 ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఆరు రోజుల ముందు మాత్రమే. అదే సమయంలో ఉగాది, రంజాన్ పండుగల కారణంగా రెండు ప్రభుత్వ సెలవులు వచ్చాయి. దీంతో ఎక్కువ మంది ఈ రాయితీ వాడుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో వారి నుంచి వచ్చిన అభ్యర్ధనల మేరకు ఈ పొడిగింపు ఇచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+