ఏపీ సర్కార్ కు కాసుల పంట-జస్ట్ టెండర్లపైనే ఏకంగా రూ.1300 కోట్లు..!

ఏపీ ప్రభుత్వానికి దసరా వేళ కాసుల పంట పండింది. మద్యం షాపుల టెండర్ల ప్రక్రియలో తొలి అంకంలోనే ఏకంగా రూ.1300 కోట్ల ఆదాయం సంపాదించింది. ఇవాళ్టితో మద్యం షాపుల టెండర్ల ప్రక్రియ పూర్తి కానుంది. ఈ నెల 14న మద్యం షాపుల కోసం వేలం నిర్వహిస్తారు. దీంతో టెండర్ల దశలోనే రూ.1300 కోట్లు సంపాదిస్తే ఇక వేలంలో ఎన్ని వేల కోట్లు సంపాదించబోతున్నారనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది.

ఈసారి ఏపీలో మద్యం షాపులకు ఎక్కడా లేని డిమాండ్ నెలకొంది. రాష్ట్రంలో కొత్త మద్యం విధానం అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం.. మద్యం షాపుల లైసెన్స్ ల కోసం టెండర్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నెల 1న ప్రారంభించిన దరఖాస్తుల ప్రక్రియ ఇవాళ సాయంత్రం ముగియనుంది. సాయంత్రం 7 గంటల వరకూ ఆన్ లైన్ లో టెండర్ దరఖాస్తులు సమర్పించేందుకు వీలుందని అధికారులు ప్రకటించారు.

ap government earned rs 1300 cr income on liquor shops tender applications

ఇప్పటివరకూ 3396 మద్యం షాపుల టెండర్ల కోసం 65424 దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇవాళ సాయంత్రం గడువు ముగిసిన తర్వాత వీటి సంఖ్య మరింత పెరగనుంది. ఇప్పటికే వీటి ద్వారా రూ.1300 కోట్లు ఆర్జించిన ప్రభుత్వం.. ఇవాళ రాత్రి కల్లా మరింత ఆదాయం సంపాదించబోతోంది. రాత్రి 7 గంటల కల్లా క్యూలైన్ లో ఉన్న వారికి మాత్రమే టెండర్ దరఖాస్తు దాఖలుకు అవకాశం కల్పించనున్నారు. ఈసారి ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా దరఖాస్తులు వచ్చాయి.

వాస్తవానికి రాష్ట్రంలో మద్యం షాపుల లైసెన్స్ ల కోసం ఈ నెల 10 వరకే దరఖాస్తుల గడువు ఉంది. 11న మద్యం షాపుల టెండర్ల వేలం నిర్వహించి 12 నుంచి కొత్త విధానం అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావించింది. కానీ అనూహ్యంగా పెరిగిన డిమాండ్ తో టెండర్ల దాఖలు గడువును ఇవాళ్టి వరకూ పెంచడంతో పాటు వేలం తేదీనీ 14కు మార్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+