ap curfew new timings : మరిన్ని సడలింపులు- గోదావరి జిల్లాల మినహా- తాజా మార్పులివే
ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కర్ఫ్యూ సమయాల్లో మరికొన్ని మార్పులు చేసింది. గతంలో 8 జిల్లాల్లో కరోనా పాజటివిటీ రేటు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పూర్తి మినహాయింపులు ఇవ్వలేదు. ఇప్పుడు ఆయా జిల్లాల్లో 6 జిల్లాలకు కొత్త మినహాయింపులు ప్రకటించింది. మరో రెండు జిల్లాల్లోనూ పూర్తి మినహాయింపు ఇవ్వకుండా కొన్ని మార్పులు చేసింది. జూలై 8 నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి.
ఏపీ ప్రభుత్వం తాజాగా చేసిన కర్ఫ్యూ సమయాల మార్పుల ప్రకారం తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో మార్పులు జరిగాయి. ఈ రెండు జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ కర్ఫ్యూ మినహాయింపు ఇచ్చారు. 7 గంటల నుంచి తర్వాతి రోజు ఉదయం 6 గంటల వరకూ ఈ రెండు జిల్లాల్లో కర్ఫ్యూ కొనసాగనుంది. ఈ రెండు జిల్లాల్లో సాయంత్రం 6 గంటలకే దుకాణాలు మూసివేయాల్సి ఉంటుంది. పాజిటివిటీ రేటు 5 కంటే తగ్గే వరకూ ఈ ఆంక్షలు కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది.

మరోవైపు రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపుల్ని రాత్రి 10 గంటల వరకూ పెంచారు. గతంలోనే ఐదు జిల్లాల్లో కర్ఫ్యూ మినహాయింపుల్ని రాత్రి 10 గంటల వరకూ పెంచగా.. ఇప్పుడు మరో ఆరు జిల్లాల్లోనూ దీన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ 11 జిల్లాల్లో రాత్రి 9 గంటల వరకే దుకాణాలు పనిచేస్తాయి. అలాగే సీటుకూ, సీటుకూ మధ్య ఖాళీ ఉండేలా సినిమా ధియేటర్లు నడుపుకునేందుకు కూడా అనుమతిచ్చారు. రెస్టారెంట్లు, జిమ్స్, కళ్యాణ మండలపాలు... ఇలా అన్నిచోట్లా కోవిడ్ ప్రోటోకాల్స్‌తో అనుమతి ఇచ్చారు.
Recommended Video
జనం ఉండేచోట కచ్చితంగా సీటుకు సీటుకు మథ్యఖాళీ తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం నిర్దేశించింది. అలాగే శానిటైజర్, మాస్క్, భౌతిక దూరాన్ని తప్పనిసరిగా కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కోవిడ్ విస్తరణను పరిగణలోకి తీసుకుంటూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అధికారుల్ని సీఎం జగన్ ఆదేశించారు.












Click it and Unblock the Notifications