Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

AP E-KYC : ఏపీలో రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్-ఈ-కేవైసీ గడువు పొడిగింపు

ఏపీలో రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ -కేవైసీ నమోదు కారణంగా తలెత్తున్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిన్నటితో ఈ-కేవైసీ నమోదు గడువు ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకటించింది. దీంతో ఇప్పటివరకూ దీన్ని నమోదు చేయించుకోని వారికి భారీ ఊరట దక్కింది.

కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్-వన్ రేషన్ పథకంలో భాగంగా లబ్దిదారులైన పేదలు ఏ రాష్ట్రంలో అయినా రేషన్ తీసుకునేందుకు వీలుగా ఈ-కేవైసీని తప్పనిసరిగా నమోదు చేయించాలని రాష్ట్రాలకు సూచించింది. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా ఈ-కేవైసీ నమోదును ప్రారంభించింది. అయితే కరోనా పరిస్ధితుల నేపథ్యంలో ఆధార్ కేంద్రాలతో పాటు ఈ-కేవైసీ నమోదు కేంద్రాలు పనిచేయకపోవడం, భారీ ఎత్తున పిల్లా పాపలతో లబ్దిదారులు వీటికి పొటెత్తడంతో ఈ ప్రక్రియలో ఇభ్బందులు తలెత్తాయచి. దీంతో ప్రభుత్వం ఈ-కేవైసీ తప్పనిసరి అయినప్పటికీ లబ్దిదారుల్ని దృష్టిలో ఉంచుకుని పలు ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకుంది.

ap government extends due date of e-kyc registration for ration cards up to september 15

గతంలో రేషన్ కోసం ఈ-కేవైసీ నమోదుకు ఇచ్చిన గడువు ఆగస్టు 31తో పూర్తయింది. దీంతో వివిధ కారణాలతో ఇంకా నమోదు చేయించుకోని లబ్దిదారుల్లో ఆందోళన మొదలైంది. ఈ నెల నుంచి రేషన్ కోతలు మొదలవుతాయనే భయాలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రభుత్వం ఈ-కేవైసీ నమోదుకు గడువును ఈ నెల 15 వరకూ పెంచింది. అంటే మరో 15 రోజల పాటు ఈ-కేవైసీ నమోదు చేయించుకునేందుకు లబ్దిదారులకు అవకాశం కల్పించింది. ఈ మేరకు పౌరసరఫరాలశాఖ కమిషనర్ కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. లబ్ధిదారులెవరూ ఇబ్బంది పడకూడదనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు శశిధర్ తెలిపారు.

Recommended Video

    Chiru బృందంలో Mahesh Babu, Allu Arjun | Ys Jagan ఒకే అంటేనే || Oneindia Telugu

    గత నెలలో వరుసగా సెలవులు, పండుగలు రావడంతో పాటు సర్వర్లు సరిగా పని చేయక పలు చోట్ల ఆధార్‌ నమోదు ప్రక్రియ నత్తడనకన సాగింది. సెలవులతో ఈ కేవైసీ నమోదుకేంద్రాలు పని చేయలేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ-కేవైసీ నమోదుకు గడువు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ఐదేళ్ల లోపు పిల్లలకు ఆధార్‌తో అనుసంధానం అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. మిగతా వారికి మాత్రం ఈ-కేవైసీ నమోదు ప్రక్రియ సెప్టెంబర్ 15 వరకూ కొనసాగనుంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+