AP Assembly Whips: అసెంబ్లీలో విప్ లుగా వీరేనా ? రేపు అధికారిక ప్రకటన..!
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజుకు చేరుకున్నాయి. తొలి రోజు గవర్నర్ ప్రసంగం, రెండో రోజు రెండు కీలక బిల్లుల ఆమోదం, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగాయి. ఇక మూడు శ్వేతపత్రాల విడుదలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అదే సమయంలో అసెంబ్లీలో కీలకమైన విప్ ల నియామకానికి ఎన్డీయే ప్రభుత్వం సిద్దమైంది. ఈసారి ఎన్డీయే ప్రభుత్వంలో మూడు పార్టీల నుంచి మొత్తం ఏడుగురిని విప్ లుగా ఖరారు చేయబోతున్నారు.
ఎన్నికల్లో కూటమిగా కలిసి పోటీ చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇప్పుడు విప్ ల విషయంలోనూ సమన్యాయం పాటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కూటమిలో కీలకమైన టీడీపీ నాలుగు విప్ పదవుల్ని తీసుకోనుంది. అలాగే జనసేన నుంచి ఇద్దరు, బీజేపీ తరపున ఒకరికి అవకాశం దక్కనుంది. ఈ ఏడుగురు విప్ లు సమన్వయం చేసుకుంటూ అసెంబ్లీని సజావుగా నడిపించాల్సి ఉంటుంది.

టీడీపీ నుంచి విప్ లుగా కమ్మ సామాజిక వర్గం నుంచి ఇద్దరు, ఓ బీసీ, మరో ఎస్సీకి అవకాశం కల్పించనున్నారు. ఇందులో
ఛీఫ్ విప్ గా బీటీ నాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర, జీవీ ఆంజనేయులులో ఒకరికి అవకాశం దక్కనుంది. మిగిలిన పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. అలాగే జనసేన నుంచి ఓ బీసీ, ఓ ఎస్సీకి అవకాశం దక్కుతుందని చెప్తున్నారు. వీరిలో బొమ్మిడి నాయకర్, దేవ వర ప్రసాద్, లోకం మాధవి పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజుకు అవకాశం దక్కనుంది. దీనిపై రేపు అధికారిక ప్రకటన వెలువడనుంది..












Click it and Unblock the Notifications