గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు తాజా షాక్..! కీలక ఆదేశాలు..!

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే కూటమి సర్కార్ రాక తర్వాత సచివాలయ ప్రక్షాళన, ఉద్యోగుల వర్గీకరణతో పాటు పలు నిర్ణయాలు తీసుకుంది. ఇదే క్రమంలో ఉద్యోగుల్లో బాధ్యత పెంచడం ద్వారా ప్రజలకు పథకాలు సక్రమంగా అందేలా చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పుడు సచివాలయాల్లో ఉద్యోగుల అందుబాటు పెంచేందుకు మరో నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఫేషియల్ అటెండెన్స్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగులు సచివాలయాల్లో అందుబాటులో ఉండటం లేదన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు ప్రజలకు పూర్తి స్ధాయిలో అందుబాటులో ఉంచడం ద్వారా సంతృప్త స్ధాయిలు పెంచాలని భావిస్తున్న ప్రభుత్వం వారికి ఫేషియల్ హాజరు నమోదును తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.

ap government fresh shocker to village ward secretariat employees over facial attendance

ఉద్యోగులు ఇకపై సచివాలయాలకు నిర్ణీత సమయాలకు కచ్చితంగా రావాల్సి ఉంటుంది. అలాగే సచివాలయాల నుంచి ఇంటికి నిర్ణీత సమయాల్లోనే తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఇందులో ఎక్కడ తేడా వచ్చినా జీతాల్లో కోత విధించేందుకు వీలుగా ఆదేశాలు ఇచ్చింది. సచివాలయాలకు ఉద్యోగులు ఆలస్యంగా వస్తే వారి జీతాల్లో కోత విధించాలని నిర్ణయించింది. పండుగ తర్వాత నుంచీ ఈ ఆదేశాలు పక్కాగా అమలు కాబోతున్నాయి.

ap government fresh shocker to village ward secretariat employees over facial attendance

ఇప్పటికే సచివాలయాలకు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుల పేరుతో మార్పులు చేసిన ప్రభుత్వం .. ఇప్పుడు వాటి పనితీరులోనూ పూర్తి స్దాయిలో మార్పులు ఆశిస్తోంది. ఇందులో భాగంగానే ఉద్యోగుల అందుబాటును పూర్తి స్ధాయిలో ఉండేలా చూడాలని భావిస్తోంది. దీంతో ఈ ఫేషియల్ అటెండెన్స్ నిబంధన విధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+