Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎం జగన్ కీలక నిర్ణయం - రైతులకు భారీ ఊరట..!!

ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వేలాది మంది రైతులకు ఊరట కలిగించే నిర్ణయం ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రం లోని నిర్ణయం వల్ల దాదాపు 23,023 రైతులకు మేలు జరగనుంది. టీడీపీ ప్రభుత్వం 2016లో తీసుకొచ్చిన చట్టంతొ ఇబ్బందుల్లో పడ్డ రైతులకు ఉపశమనం కలిగిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. రైతులు సీఎం జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసారు.

చుక్కల భూమి సమస్యకు పరిష్కారం
రాష్ట్రంలో కొన్నేళ్లుగా చక్కుల భూమి సమస్య వేలాది మంది రైతులను ఇబ్బంది పెడుతోంది. దీనికి సీఎం జగన్ శాశ్వత పరిష్కారం చూపార‌ు. బ్రిటిష్‌ పాలన హయాంలో సర్వే చేసినప్పుడు ఒక భూమి ఎవరికీ చెందినట్లు లేకపోతే, ఆ భూమికి మూడు చుక్కలు పెట్టారు. వాటినే చుక్కల భూములుగా వ్యవహరిస్తున్నారు. ఈ చుక్కల భూముల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు.

చుక్కల భూమి సమస్యపై రైతు దరఖాస్తు చేస్తే, అధికారుల దగ్గర నెలల తరబడి అపరిష్కృతంగా ఉండి పోయేవి. దీంతో రైతులు ఆందోళన చేసినా, ఉద్యమం కొనసాగించారు. ఆ సమస్యలు పరిష్కారం అయ్యేలా.. సీఎం వైయస్‌ జగన్, సరళీకృత నిబంధనలు తీసుకొచ్చారు.

AP government has decided to grant title to all the Dot lands Farmers,As passes bill in the Assembly

గత ప్రభుత్వ హయాంలో..
చుక్కల భూములకు సంబంధించి గత ప్రభుత్వం 2016, మే 5న, జీఓ నెం.198 జారీ చేసింది. దాని ప్రకారం చుక్కల భూముల్ని 22(ఏ)లో చేర్చడంతో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. అంతే కాకుండా వారం తర్వాత.. అంటే 2016, మే 13న, ఆనాటి ప్రభుత్వం మరో జీఓ నెం. 216 జారీ చేస్తూ.. చుక్కల భూముల జాబితాలో మరిన్ని భూములు చేర్చి, ఎవ్వరూ చుక్కల భూములు లావాదేవీలు చేయటానికి లేదని, అవన్నీ ప్రభుత్వ భూములుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది.

అలా మొత్తం చుక్కల భూములను నిషేధిత జాబితాలోకి చేర్చారు. ఇప్పుడు వీఆర్‌ఓ, ఎమ్మార్వో, ఆర్డీఓ, జేసీ, కలెక్టర్‌.. చివరకు సీసీఎల్‌ఏ ఆమోదం తర్వాత చుక్కల భూమి నుంచి తొలగించాలనే నిబంధనను సీఎంగారు సరళీకరించారు. సీఎం జగన్ నిర్ణయం వల్ల దాదాపు 23,023 రైతులకు చెందిన 43,270 ఎకరాలను ఒకేసారి చుక్కల భూముల జాబితా నుంచి తొలగించే అవకాశం ఏర్పడింది.

సీఎం చేతుల మీదుగా పట్టాల పంపిణీ..
చుక్కల భూముల జాబితా నుంచి తొలగించిన భూముల పట్టాలను ముఖ్యమంత్రి జగన్ రైతులకు అందించనున్నారు. చుక్కల భూములకు సంబంధించి గత ప్రభుత్వం 2016, మే 5న, జీఓ నెం.198 జారీ చేసింది. దాని ప్రకారం చుక్కల భూముల్ని 22(ఏ)లో చేర్చడంతో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. ఎవ్వరూ చుక్కల భూములు లావాదేవీలు చేయటానికి లేదని, అవన్నీ ప్రభుత్వ భూములుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది.

అలా మొత్తం చుక్కల భూములను నిషేధిత జాబితాలోకి చేర్చారు. ఇప్పుడు ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఒకే విడతలో చుక్కల భూముల నుంచి పట్టా భూములగా గుర్తించి అడంగళ్‌ 1(బీ) ఇవ్వనున్నారు. చుక్కల భూముల్లో కాల్వ పోరంబోకులు, వాటర్‌ బాడీలు, ప్రభుత్వ భవనాలు ఉన్నవి పక్కన పెట్టి.. మిగతావి పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+