AP Pensions: ఏపీలో కొత్త పెన్షన్లకు ముహుర్తం ఫిక్స్ ? 6 లక్షల మందికి..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్లు ఇచ్చే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం లబ్దిదారుల గుర్తింపు, దరఖాస్తుల స్వీకరణ సహా ఇతర కార్యక్రమాలపై చర్చిస్తోంది. ఇవి పూర్తయ్యాక లబ్దిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈసారి పెన్షన్ల కోసం దాదాపు 6 లక్షల దరఖాస్తులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరు కోసం ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే పెన్షన్లపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం ఓసారి భేటీ అయింది. ఈ వారంలో మరోసారి భేటీ అయి ప్రభుత్వానికి పంపే ప్రతిపాదనలు ఖరారు చేయబోతోంది. వీటిని పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ మొత్తం ప్రక్రియ జూన్ నెలాఖరుకు పూర్తి చేసి జూలై నుంచి కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది.

రాష్ట్రంలో ప్రస్తుతం వివిధ కేటగీరీల్లో 63 లక్షల మంది లబ్దిదారులకు పెన్షన్లు ఇస్తున్నారు. కొత్తగా పెన్షన్ల నమోదు ప్రారంభిస్తే మరో 6 లక్షల వరకూ దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు. వీరందరికీ ఇస్తే నెలకు మరో 250 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందని అంచనా. గతంలో వైసీపీ హయాంలో అర్హత ఉండి కూడా పెన్షన్లు ఇవ్వని వారికి మరో అవకాశం ఇచ్చి దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో కొత్త పెన్షన్ల కోసం త్వరలో దరఖాస్తులు ఆహ్వానించబోతున్నారు. అనంతరం వాటిని ప్రాసెస్ చేసి పెన్షన్లు అందించబోతున్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో అమల్లో ఉన్న పెన్షన్ల లబ్దిదారుల్లో అనర్హుల్ని ఏరివేసే ప్రక్రియ పూర్తయింది. దీని కోసం రాష్ట్రంలో పలుమార్లు డ్రైవ్ లు నిర్వహించారు. వీటిపై విమర్శలు వచ్చినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు కొత్తగా అర్హుల్ని గుర్తించి వారిని లబ్దిదారుల జాబితాలో అవకాశం కల్పించబోతున్నారు. తద్వారా అర్హులకే ప్రభుత్వ సంక్షేమ పథకం అందేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే జూలై నుంచి కొత్త పెన్షన్లు లభిస్తాయి.












Click it and Unblock the Notifications