రైతులకు శుభవార్త చెప్పిన చంద్రబాబు... అక్టోబరు 1 నుంచి

ఏపీ ప్రభుత్వం రెండు కీలక అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంది. అందులో ఒకటి.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏఐఐబీ బ్యాంకు ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి సంబంధించి కొత్త సాంకేతికతను ఉపయోగించాలని, నాణ్యత విషయంలో రాజీపడవద్దని బ్యాంకు ప్రతినిధులకు పవన్ కల్యాణ్ సూచించారు. గ్రామీన ప్రాంతాల్లోని రోడ్ల నిర్మాణంపై కాంట్రాక్టర్లకు ఒక నియమావళిని రూపొందిస్తే భవిష్యత్తులో కూడా ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. పల్లెల్లోని రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధులను ఏఐఐబీ బ్యాంకు సమకూరుస్తోంది.

వర్క్ షాప్ నిర్వహించిన మంత్రి మనోహర్
అలాగే రైతులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించబోతున్నారు. ఈ విషయాన్ని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన వర్క్ షాప్ ను ప్రభుత్వం నిర్వహించింది. జేసీలు, వ్యవసాయశాఖ, మార్కెటింగ్, సహకార, పౌరసరఫరాలశాఖ అధికారులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లోకి ఇకనుంచి డబ్బులు వేయబోతున్నారు.
ధాన్యం అమ్మకంతోపాటు మిల్లులను ఎంచుకునే స్వేచ్ఛ కూడా రైతులకే ఇస్తున్నట్లు మంత్రి మనోహర్ తెలిపారు.

AP government is going to start procurement of grain from October 1st

గత ప్రభుత్వ నిర్వాకమే
ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన లారీలను కూడా భారీ సంఖ్యలో ఏర్పాటు చేశారు. ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకర్ ఏర్పాటు చేస్తున్నారు. రైతులకు రూ.1700 కోట్లు బకాయి పెట్టని గత ప్రభుత్వ నిర్వాకంపై మంత్రి మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వాటిని వెంటనే చెల్లించిన విషయాన్ని గుర్తుచేశారు. పౌరసరఫరాలశాఖద్వారా ప్రజలకు రేషన్ దుకాణాలద్వారా అందబోతున్న బియ్యం కూడా ఎంతో నాణ్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. రేషన్ డీలర్ల సంఖ్యను కూడా పెంచబోతున్నామని, బియ్యంతోపాటు పంచదార, కందిపప్పు, రాగులు, గోధుమపిండి, నూనెతోపాటు భవిష్యత్తులో వీటి సంఖ్యను పెంచుతామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+