ఏపీ నుంచి బెంగళూరుకు కొత్తగా గ్రీన్‌ఫీల్డ్ హైవే: రూట్‌మ్యాప్ ఇదే: డీపీఆర్‌పై కసరత్తు
అమరావతి: ఏపీ నుంచి సిలికాన్ సిటీ బెంగళూరుకు మరో జాతీయ రహదారి కనెక్టివిటీ ఏర్పాటు కానుంది. కర్నూలు, హిందూపురం, చిత్తూరు వైపు నుంచి బెంగళూరకు వెళ్లడానికి ప్రస్తుతం జాతీయ రహదారులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మరొకటి ఈ జాబితాలో చేరనుంది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌పై కసరత్తు చేస్తోంది. తుదిరూపాన్ని ఇస్తోంది. డీపీఆర్ తయారైన వెంటనే దాన్ని ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపించనుంది. ఇప్పుడు కొత్తగా ప్రతిపాదించిన ఈ జాతీయ రహదారి- గ్రీన్‌ఫీల్డ్ హైవేగా రూపుదిద్దుకోనుంది.
విజయవాడ నుంచి బెంగళూరు మధ్య కొత్త మార్గంలో కనెక్టివిటీని కల్పించే ప్రాజెక్ట్ ఇది. కడప, శ్రీసత్యసాయి జిల్లా మీదుగా ఈ జాతీయ రహదారిని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా డీపీఆర్‌ను సిద్ధం చేస్తోంది. సత్యసాయి జిల్లాలో దీనికి సంబంధించిన భూసేకరణ పనులను కూడా త్వరలోనే చేపట్టేలా ప్రణాళికలను రూపొందించింది. డీపీఆర్ పూర్తయిన తరువాత.. తుది ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తుంది.

సత్యసాయి జిల్లాలో 75 కిలో మీటర్ల మేర ఈ రహదారి నిర్మాణం కొనసాగుతుంది. ప్రకాశం జిల్లాలోని ముప్పవరం నుంచి సత్యసాయి జిల్లాలోని హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఉన్న కోడూరు గ్రామాన్ని అనుసంధానించేలా ఇది నిర్మితం కానుంది. కోడూరు వద్ద హైదరాబాద్-బెంగళూరు హైవేను కనెక్ట్ చేసేలా డీపీఆర్‌ను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. శ్రీసత్యసాయి జిల్లాలోని గోరంట్ల, ఓబుల దేవర చెరువు, కదిరి మీదుగా నిర్మించడానికి అవసరమైన భూసేకరణ పనులను జిల్లా అధికారులు చేపట్టారు.
రోడ్ మార్కింగ్ సైతం చేపట్టినట్లు తెలుస్తోంది. కదిరి శ్రీసత్యసాయి జిల్లా సరిహద్దులు ముగుస్తాయి. అనంతరం కడప జిల్లా హద్దలు మొదలవుతాయి. పులివెందుల సమీపంలోని వీరపునాయునిపల్లె, యర్రగుంట్ల, కమలాపురం, మైదుకూరు, పోరుమామిళ్ల మీదుగా ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం సాగుతుంది. నెల్లూరు జిల్లాలోని సీతారాంపురం, ప్రకాశం జిల్లా కంభం, పామూరు, కనిగిరి, అద్దంకి మీదుగా ముప్పవరం వరకు రోడ్డు కనెక్టివిటీ ఉంటుంది. ముప్పవరం అక్కడి జాతీయ రహదారితో దీన్ని కనెక్ట్ చేస్తారు. నాలుగు ప్యాకేజీలుగా దీన్ని నిర్మించే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications