ఆస్పత్రులకు ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు..! మెడికల్ కాలేజీల చర్చ వేళ..!

ఏపీలో వైసీపీ హయాంలో తెచ్చిన మెడికల్ కాలేజీలను పీపీవీ విధానంలో నిర్మించాలని కూటమి సర్కార్ తీసుకున్న నిర్ణయంపై రాజకీయంగా రచ్చ జరుగుతున్న వేళ ప్రస్తుతం రాష్ట్రంలో నడుపుతున్న ప్రభుత్వ ఆస్పత్రులకు ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా ప్రైవేట్ కాలేజీలు, ఆస్పత్రులు వస్తే రోగులకు సేవలు అందవంటూ వైసీపీ విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఆస్పత్రుల్లో సేవల విషయంలో ప్రభుత్వం ఈ ఆదేశాలు ఇచ్చింది.

రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో వైద్య సేవలు మరింత మెరుగుపడాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్ స్పష్టం చేశారు.
వైద్యుల రోజూవారీ వ్యక్తిగత పనితీరుకు సంబంధించిన పూర్తి వివరాలు రోగుల ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు యాప్ (ఈహెచ్ఆర్)లో కనిపించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్యులు చికిత్స అందించిన వారి సంఖ్య కాకుండా సదరు రోగుల వ్యక్తిగత వివరాలు, వారికి అందించిన చికిత్స, రాసిచ్చిన మందులు, చేయించిన నిర్ధారణ పరీక్షల వివరాలు వంటి వివరాలు ఈహెచ్ఆర్ (నెక్ట్స్ జెన్)లో పూర్తి స్థాయిలో ఉండాలన్నారు. తద్వారా వైద్యులు రోగులకు కేటాయిస్తున్న సమయం, ఓపీ, ఐపీలో చూసిన రోగుల సంఖ్య, రోగ నిర్ధారణకు ఏ విధంగా అవగాహనకు వచ్చారు? ఇచ్చిన మందుల వివరాలు, ఇతర సమాచారం ఉన్నట్లయితే అవసరమైన సందర్భాల్లో చర్యలు తీసుకోవడానికి వీలుంటుందన్నారు.

ap government key orders to state-run hospitals amid medical colleges privatisation debate

విజయవాడలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కార్యాలయంలో సోమవారం ఉన్నతాధికారులతో సౌరభ్ గౌర్ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంటు (అభా) ఆధారంగానే రోగులకు ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స జరుగుతుందన్నారు. ఇందుకు అనుగుణంగా వైద్యులు వారికి అందించే పూర్తి చికిత్స వివరాలు ఆన్లైన్లో ఉన్నట్లయితే భవిష్యత్తు అవసరాలకు బాగా ఉపయోగపడుతుందన్నారు. అలాగే.. వైద్యులు, ఇతర సిబ్బంది పనితీరు ఎలా ఉందో బేరీజు వేసి, అవసరమైన చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందన్నారు. ఇలాంటి చర్యలవల్ల వైద్య సేవల్లో నాణ్యత పెరుగుతుందని చెప్పారు. పనిచేయని వారిపై చర్యలు తీసుకోవడానికి వీలవుతుందన్నారు తమ పనితీరు గురించి వైద్యులు, ఇతర సిబ్బంది ఎప్పటికప్పుడు ఆన్లైన్లో చూసుకోవడం కూడా సులువు అవుతుందన్నారు.

ap government key orders to state-run hospitals amid medical colleges privatisation debate

బోధనాసుపత్రుల్లో జరిగే మరణాలకు దారితీసిన కారణాలు కూడా ఆన్లైన్లో స్పష్టంగా నమోదు చేయాలని సౌరభ్ గౌర్ అధికారుల్ని ఆదేశించారు. ఈ వివరాల నమోదులో సదరు రోగి స్వగ్రామం దగ్గర నుంచి పూర్తి వివరాల నమోదు ఆన్లైన్లో జరగాలన్నారు. దీనివల్ల ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులు, సదరు రోగాల తీవ్రత వంటి వివరాలు తెలియడం ద్వారా ముందస్తు చర్యలు చేపట్టేందుకు, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోవడానికి వీలుంటుందని పేర్కొన్నారు. ఆన్లైన్లో వివరాల నమోదులో అలసత్వాన్ని ప్రదర్శిస్తే పర్యవేక్షణ అధికారుల నుంచి చర్యలు ఉంటాయన్నారు. త్వరలో వాట్సప్ గవర్నెన్స్ (మనమిత్ర) ద్వారా వైద్యుల వద్దకు వెళ్లేముందుగానే అపాయింట్మెంట్ తీసుకునే అవకాశాన్ని కల్పించాలని పేర్కొన్నారు. అభా ఖాతాల ప్రాధాన్యంపై ప్రజల్లో అవగాహన పెరిగేందుకు విస్తృత సాయిలో ప్రచారాన్ని నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రులో ఇన్ పేషెంట్ రోగులు (వాకింగ్) నడిచేందుకు అవసరమైన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+