అన్నదాత సుఖీభవ డబ్బులు పడలేదా ? మీకోసం ప్రభుత్వం కీలక అప్డేట్..!
ఏపీలో అన్నదాత సుఖీభవ పథకం కింద ఇవాళ 44.75 లక్షల రైతుల ఖాతాల్లో 7 వేల రూపాయల చొప్పుున ప్రభుత్వం నిధుల్ని జమ చేసింది. ఈ మేరకు 99.98 శాతం మంది లబ్దిదారులకు ఈ నగదు జమ అయినట్లు రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ (ఆర్టీజీఎస్) వివరాలు వెల్లడించింది. ఈ మేరకు నాణ్యంగా రైతుల డేటాను అందించినందుకు వ్యవసాయ శాఖను ప్రభుత్వం అభినందించింది. అదే సమయంలో అధికారులకు మిగిలిన వారి విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది.
అన్నదాత సుఖీభవ పథకం కింద ఇంకా నగదు అందని లక్ష మంది రైతుల విషయంలో ప్రభుత్వం తమకు పలు ఆదేశాలు ఇచ్చిందని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పలు చోట్ల ఉపఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాలలోని సుమారు లక్ష మంది రైతులకు ఈసీ ఆదేశాల మేరకు తాత్కాలికంగా నగదు జమ చేయలేదని, అలాగే ఎన్సీపీఐలో యాక్టివ్ గా లేని, మ్యాపింగ్ కాని మరో లక్ష మంది రైతుల ఖాతాలు మినహాయించి మిగిలిన వారికి నగదు జమ అయిందన్నారు. తాము ఇచ్చిన డేటాలో 1067 మందికి మాత్రమే నగదు జమ కాలేదన్నారు.

ఇవాళ అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్పులు ఖాతాల్లో పడని లబ్దిదారులకు ఢిల్లీ రావు కీలక సూచన చేశారు. రేపటి నుండి
ప్రభుత్వ కార్యాలయాల్లో ఫిర్యాదుల పరిష్కార వేదికల్లో వీటిపై ఫిర్యాదులు చేసుకోవచ్చని తెలిపారు. సీసీఆర్సీ కార్డులున్న భూమి లేని రైతులకు అక్టోబర్ నెలలో నిధుల విడుదల చేస్తామన్నారు. ఎన్సీపీఐలో యాక్టివ్ గా లేని ఖాతాలు, ఆధార్ మ్యాపింగ్ కాని ఖాతాలు అన్నదాత సుఖీభవ పథకం తిరస్కరణ పరిధిలోకి రావని ఆయన స్పష్టం చేశారు. అప్ డేట్ తర్వాత వారి ఖాతాలో ఈ మొత్తం జమ అయ్యే అవకాశం ఉందన్నారు.
అన్నదాత పథకంలో ఇవాళ డబ్బులు పడని వారు ఏ కారణాలతో తిరస్కరణకు గురయ్యారో క్షేత్రస్ధాయిలో అధికారులు అర్ధం చేసుకుని, ఆ తర్వాత రైతులకు వివరించాలన్నారు. తిరస్కరించబడిన కేసులపై విజ్ఞప్తులతో గ్రామస్థాయిలోని రైతు సేవా కేంద్రాలు లేదా నియోజక వర్గ , జిల్లా స్థాయిలో అధికారులను సంప్రదించే వారికి సరైన సమాధానాలు ఇవ్వాలని సిబ్బందిని కోరారు. అన్నదాత సుఖీభవ పథకం రాని కేసుల్లో మృతులుగా గుర్తించిన వారు, తప్పుగా ఆధార్ లింకేజీ అయినవారు, నోషనల్, సివిల్ లిటిగేషన్ కేసులు, న్యాయపరమైన సమస్యలు ఉన్న ఖాతాలు, వ్యవసాయేతర భూములు, అర్హత లేని వ్యక్తులు ఉన్నట్లు ఢిల్లీ రావు వెల్లడించారు.

అనర్హుల్లో నెలకు 20 వేల కంటే 000 కంటే ఎక్కువ జీతం పొందుతున్న ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించేవారు, ప్రజా ప్రతినిధులు, సచివాలయంలో మ్యాపింగ్ కాని ఖాతాలు, ఒకే ఇంట్లో ఇద్దరు దరఖాస్తు చేసుకున్న వారు, 10 సెంట్లు లోపల భూములు, మైనర్ ఖాతాలు ఉన్నట్లు తెలిపారు. ఈకేవైసీ కాని వారు, ఎన్సీపీఐ యాక్టివ్ గా లేని వారివి మాత్రం తిరస్కరించలేదన్నారు. మే 2 నుండి జూలై 15 మధ్య కొత్తగా మ్యాప్ అయిన రికార్డుల కోసం ఫిర్యాదుల పరిష్కార వేదికల్లో అవకాశం కల్పిస్తామన్నారు. ఇంకా ఏవైనా సందేహాలుంటే రైతు సేవా కేంద్రం ,మండల, జిల్లా వ్యవసాయ అధికారులను సంప్రదించవలసినదిగా రైతుల్ని కోరారు.
-
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications