వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరెంట్ బిల్ కు రేషన్, పెన్షన్ లకు ముడి పెట్టిన ఏపీ సర్కార్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్‌, రేషన్‌ కార్డులకు కరెంట్ బిల్లులకు లింక్ పెట్టింది ఏపీ సర్కార్ . రేషన్ ఇవ్వాలన్నా, పెన్షన్ ఇవ్వటానికైనా కరెంటు బిల్లులను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్రంలో 200 యూనిట్‌లు దాటితే రేషన్‌ కట్‌, 300 యూనిట్‌లు దాటితే పెన్షన్‌ కట్‌ నిబంధన ఇప్పుడు పింఛన్ అందుకునేవాళ్లకు, రేషన్ కార్డు లబ్దిదారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.

కారుంటే రేషన్ కార్డు గల్లంతే ...ఏపీలో మారిన రేషన్ రూల్స్కారుంటే రేషన్ కార్డు గల్లంతే ...ఏపీలో మారిన రేషన్ రూల్స్

 కరెంట్ బిల్లుపై ఆధారపడి రేషన్ ,పెన్షన్

కరెంట్ బిల్లుపై ఆధారపడి రేషన్ ,పెన్షన్

భార్యభర్తల పేరు మీద ఆధార్‌ కార్డుతో అనుసంధానమై ఉన్న అన్ని సర్వీసులను కలిపి ఒక యూనిట్‌గానే తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. అంతే కాదు వీటిలో గృహ సర్వీసులతో పాటు వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక సర్వీసులను కూడా కలిపి ఒక యూనిట్‌గా తీసుకోనున్నారు. ఇప్పటివరకు సొంత పట్టా భూముల్లో నిర్మించుకున్న ఇళ్లు మాత్రమే సొంత భవనాల కింద పరిగణించేవారు.
ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అసలు రేషన్, పెన్షన్ తీసుకున్న అందరి విద్యుత్‌ వినియోగం పరిగణలోకి తీసుకోనున్నారు.

ఇష్టారాజ్యంగా కరెంట్ వాడితే ఇబ్బందే

ఇష్టారాజ్యంగా కరెంట్ వాడితే ఇబ్బందే

బీఫారాల్లో ఉన్న ఇళ్లు, స్వాధీనాల్లో ఉన్న ఇళ్లు, రోడ్ల పక్కన ఆక్రమించుకొని ఉంటున్న వారు కూడా ఈ జాబితాలో చేరుతారు. ఇక ఇళ్లను అమ్ముకున్న వాళ్లకు, మీటర్ల పేర్లు మార్చుకోకుంటే తిప్పలు తప్పేలా లేవు. ఇళ్లు అమ్ముకున్నా విద్యుత్‌ సర్వీసుల పేర్లను మార్చుకోనివారు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు వారంతా తెగ ఇబ్బంది పడుతున్నారు.పొరుగు రాష్ట్రాల్లో ఉండి ఊళ్లలో ఇళ్లు ఉన్నవాళ్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

200 యూనిట్లు దాటితే రేషన్..300యూనిట్లు దాటితే పెన్షన్ కట్

200 యూనిట్లు దాటితే రేషన్..300యూనిట్లు దాటితే పెన్షన్ కట్

అద్దెకు ఉన్నవాళ్లు ఎక్కువ కరెంటు వాడితే ఆ ఎఫెక్ట్ వీళ్ల మీద పడుతుంది. మొత్తానికి ఏది ఏమైనా కరెంట్ బిల్లులు 200 యూనిట్లు దాటితే రేషన్ కట్ చేసేలా , 300యూనిట్లు దాటితే పెన్షన్ కట్ చేసేలా నిర్ణయం తీసుకుని షాక్ ఇస్తుంది ఏపీ సర్కార్ . ఏపీలో ఆహార భద్రత నియమాల్లో సవరణలు చెయ్యాలని భావించిన ప్రభుత్వం రేషన్ కార్డులకు ఎవరు అర్హులు అన్న సవరణలు చేసింది. రేషన్ కార్డుల జారీకి గతంలో ఉన్న అర్హతల్లో మార్పులు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం .

 కొత్త నిబంధనలతో లబ్దిదారులకు చిక్కులు

కొత్త నిబంధనలతో లబ్దిదారులకు చిక్కులు

కొత్త నిబంధనల ప్రకారం ఫోల్‌వీలర్స్ ఉన్న వారు రేషన్ కార్డుకు అనర్హులు. ఎవరికైనా కారు ఉంటే వారికి రేషన్ లేనట్టేనని పేర్కొన్నారు .ఇక ఇష్టారాజ్యంగా కరెంట్ వాడే వారికి కూడా షాక్ ఇస్తామని చెప్తున్నారు. ఇక ఇప్పుడు కొత్త నిబంధనల నేపధ్యంలో విలేజ్ వాలంటీర్లు లబ్దిదారుల కరెంట్ బిల్లులపై ఆరా తీస్తున్నారు. దీంతో లబ్దిదారులు ఇవేమీ నిబంధనలు అంటూ పెదవి విరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.

English summary
AP government has linked current bills to pension and ration cards in Andhra Pradesh. The government intends to consider the current bills for ration and pension. The ration cut if the usage exceeds 200 units, and the pension cut clause if it crosses 300 units . now it is creating tension for pension recipients and ration card beneficiaries
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X