అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'వీరసింహారెడ్డి'పై 'జగన్మోహన్ రెడ్డి' గుస్సా?

|
Google Oneindia TeluguNews

బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన వీరసింహారెడ్డి చిత్రంలోని డైలాగులు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఇందులోని పలు డైలాగులు ఏపీలోని వైసీపీ సర్కారును ఉద్దేశించినవేనంటూ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. బిట్లు బిట్లుగా ఉన్న ఈ డైలాగులు విపరీతంగా వైరలవుతుండటంతో అసలు వాటి సంగతి ఏమిటో తేల్చడానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధమైంది.

సినిమా చూసిన అధికారులు?

సినిమా చూసిన అధికారులు?

అసలు ఈ డైలాగులను ఏ సందర్భంలో ఉపయోగించారు? ఎవరు ఉపయోగించారు? అందుకు సందర్భం ఏమిటి? ఎవరిని ఉద్దేశించి ఈ డైలాగులు అన్నారో? అనే విషయాలు తెలుసుకోవడానికి కీలక అధికారులు కొందరు ఈ సినిమాను వీక్షించినట్లు తెలుస్తోంది. డైలాగులు కొన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉన్నట్లు గుర్తించి వాటిని ఒక నివేదిక రూపంలో అందజేసినట్లు తెలుస్తోంది. తదుపరి ఈ సినిమాపై ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకుంటుందో చూడాలి మరి.

మాటలు రాసిన సాయిమాధవ్ బుర్రా

మాటలు రాసిన సాయిమాధవ్ బుర్రా

వీరసింహారెడ్డి చిత్రం ఈనెల 12వ తేదీన విడుదలైంది. విడుదలైన వెంటనే ఏపీలోని వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని డైలాగులున్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు మాటలు సాయిమాధవ్ బుర్రా అందించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో గోపీచంద్ మాట్లాడుతూ డైలాగులన్నీ సినిమా కథలో భాగంగానే వచ్చాయని, వాటిని సాయిమాధవ్ బాగా రాశారని, డైలాగులను ప్రత్యేకంగా రాసిందేమీ లేదని స్పష్టత ఇచ్చారు.

ఆ సినిమాలో డైలాగులు ఎలా ఉన్నాయో చూద్దాం..

ఆ సినిమాలో డైలాగులు ఎలా ఉన్నాయో చూద్దాం..

''ఏది అభివృద్ధి హోం మినిస్టర్‌.. ప్రగ‌తి సాధించ‌డం అభివృద్ధి.. ప్రజ‌ల్ని వేధించ‌డం కాదు. జీతాలు ఇవ్వడం అభివృద్ధి.. బిచ్చమెయ్యడం కాదు. ప‌ని చెయ్యడం అభివృద్ధి.. ప‌నులు ఆప‌డం కాదు. నిర్మించ‌డం అభివృద్ధి.. కూల్చడం కాదు. ప‌రిశ్రమ‌లు తీసుకురావ‌డం అభివృద్ధి.. ఉన్న ప‌రిశ్రమ‌లు మూయ‌డం కాదు. బుద్ధి తెచ్చుకో.. అభివృద్ధికి అర్థం తెలుసుకో''

''సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు. మార్చలేరు''
''పదవి చూసుకుని నీకు పొగరేమో.. బై బర్త్‌ నా డీఎన్‌ఏకే పొగరెక్కువ''

English summary
It is known that the dialogues of the film Veerasimha Reddy, starring Balakrishna as the protagonist, are the subject of discussion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X