AP Govt: వెబ్ సైట్లో జీవోల అప్ లోడ్-అన్ని శాఖలకు జగన్ సర్కార్ కీలక ఆదేశాలు..
ఏపీలో ప్రభుత్వం ప్రతీ రోజూ పలు అంశాలపై జీవోలు జారీ చేస్తుంటుంది. వీటిని గతంలో జీవోఐఆర్ వెబ్ సైట్లో అప్ లోడ్ చేసే వారు. ఈ జీవోల్ని సంబంధిత వ్యక్తులు, సంస్ధలు, అధికారులు చూసి తెలుసుకునే వారు. వాటి ఆధారంగా నిర్ణయాలు తీసుకునేవారు. వీటిలోనూ కొన్ని రహస్య జీవోలు ఎలాగో ఉంటాయి. వాటిపైనా చర్చ జరిగేది. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2021లో పలు మార్పులు చేశారు.
ఏపీలో జీవోల అప్ లోడింగ్ కోసం ఏపీ గెజిట్ పేరుతో కొత్త వెబ్ సైట్ ను వైసీపీ సర్కార్ అందుబాటులోకి తెచ్చింది. కానీ ప్రభుత్వ శాఖలు రోజువారీ జారీ చేసే ఆదేశాలు మాత్రం అధికారిక వెబ్ సైట్లో పూర్తిస్దాయిలో అప్ లోడ్ కావడం లేదు. దీనిపై ఎప్పటి నుంచో ఫిర్యాదులు ఉన్నాయి. అయినా ప్రభుత్వ శాఖలు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో ఏపీ ప్రభుత్వం మరోసారి అన్నిశాఖలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఆన్ లైన్ లో జీవోలు పెట్టడంపై అన్ని శాఖలకు ప్రభుత్వం మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ శాఖలు తాము తీసుకునే నిర్ణయాలను, జారీ చేసే ఉత్తర్వులను ఎప్పటికప్పుడు వెబ్ సైట్లో అప్ లోడ్ చేయాలని మరోసారి సూచించింది.
అన్ని శాఖలు తప్పనిసరిగా జీవోలను ఏపీ ఈ గెజిట్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని సాధారణ పరిపాలన శాఖ తాజాగా మరోసారి ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే 2021 సెప్టెంబర్ 7 న, 2022లోనూ సాధారణ పరిపాలన శాఖ ఇదే ఆదేశాలు ఇచ్చింది.
అయినా చాలా శాఖలు అమలు చేయకపోవడంతో ఈ ఏడాది మే నెలలోలోనూ జీవోల అప్ లోడింగ్ పై ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. అయినా ఇప్పటికీ పరిస్ధితిలో మార్పు రాకపోవడంతో మరోసారి ఇదే ఆదేశాలను పునరుద్ధాటించింది.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈసారి అయినా ఆయా శాఖలు జీవోల్ని పూర్తిస్ధాయిలో ఏపీ గెజిట్ వెబ్ సైట్లో అప్ లోడ్ చేస్తాయో లేదో చూడాలి మరి.












Click it and Unblock the Notifications