Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లు..! ఎలా పనిచేయాలో చెప్పిన చంద్రబాబు..!

ఏపీలో కూటమి సర్కార్ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా పాలనా వ్యవస్ధలో చేస్తున్న మార్పులు, చేర్పులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే సచివాలయం స్ధాయిలో పలువురు ఐఏఎస్ లను, ఉన్నతాధికారుల్ని బదిలీ చేసిన ప్రభుత్వం ఇవాళ జిల్లా కలెక్టర్లను బదిలీలు చేసింది. ఇందులో భాగంగా 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు. ఇందులో వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారులకు కూడా కలెక్టర్లుగా అవకాశం దక్కింది.

ఇవాళ జరిగిన బదిలీల్లో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గా ప్రభాకర్ రెడ్డి, విజయనగరం జిల్లా కలెక్టర్ గా రామసుందర్ రెడ్డి,
తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గా కీర్తి చేకూరి, గుంటూరు కలెక్టర్ గా తమీమ్ అన్సారియా, పల్నాడు కలెక్టర్ గా కృతిగా శుక్లా,
బాపట్ల కలెక్టర్ గా వినోద్ కుమార్, ప్రకాశం కలెక్టర్ గా రాజా బాబు అవకాశం దక్కించుకున్నారు. అలాగే నెల్లూరు జిల్లా కలెక్టర్ గా హిమాన్షు శుక్లా, అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా నిషాంత్ కుమార్, కర్నూలు కలెక్టర్ గా డాక్టర్ ఎ. సిరి, అనంతపురం జిల్లా కలెక్టర్ గా ఓ.ఆనంద్, సత్య సాయి జిల్లా కలెక్టర్ గా శ్యాంప్రసాద్ ను నియమించారు.

AP Government Orders IAS Transfers 12 District Collectors Reassigned chandrababu key messsage

మరోవైపు కొత్తగా నియమించిన జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రభుత్వ విజయాల్లో కలెక్టర్లే కీలకమని, తన ఆలోచనలు, అంచనాలు అందుకోవాలని, బెస్ట్ పెర్ఫామెన్స్ ఇవ్వాలన కోరారు. సిఎం అంటే కామన్ మ్యాన్ అని తెలిపారు. మీరూ అదే పాటించండన్నారు. అన్నింటికీ రూల్స్ కాదు, మానవీయ కోణంలో పనిచేయాలని సూచించారు. ఫేక్ ప్రచారాలు పెనుసవాల్ అని, రియల్ టైంలో వాటిపై స్పందించాలని ఆదేశించారు.

ఈసారి కలెక్టర్లకు పోస్టింగ్ ల విషయంలో మరింత గట్టి కసరత్తు నిర్వహించానని చంద్రబాబు తెలిపారు. గతంలో ఎప్పుడూ ఇంత కసరత్తు చేయలేదన్నారు. దీనికి కారణం ఉందన్నారు. అనేక సమస్యల మధ్య ఏడాది క్రితం పాలన ప్రారంభించామని, ప్రజలు తనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని చంద్రబాబు తెలిపారు. వాటిని తీర్చాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని, వీటిని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లాల్సి ఉందన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే కలెక్టర్లే కీలకమన్నారు. మీ పనితీరే ప్రభుత్వానికి విజయాలను తెచ్చి పెడుతుందన్నారు.

AP Government Orders IAS Transfers 12 District Collectors Reassigned chandrababu key messsage

నాలుగో సారి ముఖ్యమంత్రిగా ఉన్న తన టీం మీరేనన్నారరు. పనిచేస్తే ప్రోత్సహిస్తానన్నారు. ఆశించిన ఫలితాలు రాకపోతే మాత్రం క్యారీ చెయ్యనన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పిన దాంట్లో మంచి చెడు చూడాలని, ప్రజలకు ఉపయోగపడేది అయితే మానవీయ కోణంలో పనిచేయాలన్నారు. తాను తప్పు చేయమని చెప్పనని, పొలిటికల్ గవర్నెన్స్ అంటే తప్పు చేయమని కాదని, కలిసి పనిచేయమని అన్నారు. ప్రజా ప్రతినిధులకు ఇచ్చే గౌరవం ఇవ్వాలన్నారు. పొలిటికల్ గవర్నెన్స్ చేసిన సమయంలో తాను ఓడిపోలేదని, ఎక్కువ బ్యూరో క్రటిక్ గవర్నెన్స్ చేసినప్పుడే రాజకీయంగా నష్టపోయానన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+